‎Lakshmi Devi: అప్పుల బాధలు తిరిపోవాలా.. అయితే లక్ష్మిదేవికి ఈ మూడు వస్తువులు సమర్పించాల్సిందే!

‎Lakshmi Devi: ఇప్పుడు చెప్పబోయే ఈ మూడు రకాల వస్తువులు లక్ష్మీదేవికి సమర్పిస్తే చాలు, అప్పుల బాధలు తీరిపోవడం ఖాయం అని చెబుతున్నారు పండితులు.

Published By: HashtagU Telugu Desk
Lakshmi Devi

Lakshmi Devi

‎Lakshmi Devi: ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. కష్టపడి సంపాదించినా కూడా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలడం లేదని దిగులు చెందుతూ ఉంటారు. అయితే ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించమని లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించడంతోపాటు రకరకాల పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు. వాటితో ఆర్థిక సమస్యలతో బాధపడేవారు లక్ష్మీదేవికి ఇప్పుడు చెప్పబోయే మూడు రకాల వస్తువులను సమర్థిస్తే చాలు, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు అయినా తొలగిపోతాయని చెబుతున్నారు. ఆర్థిక సమస్యలతో బాధపడే వారు శుక్రవారం రోజు మహాలక్ష్మీ ఆలయాన్ని సందర్శించి, లక్ష్మీదేవికి మూడు వస్తువులు సమర్పించడం వలన ఇంటి ఆనందం, శ్రేయస్సు నెలకొనడమే కాకుండా, అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయట.

శుక్రవారం రోజున ఎవరైతే ఉపవాసం ఉండి లక్ష్మీదేవిని పూజిస్తారో, వారికి ఆర్థికంగా కలిసి వస్తుందని చెబుతున్నారు. లక్ష్మీ దేవికి చాలా ఇష్టమైన పువ్వులలో తామర పువ్వు కూడా ఒకటి. శుక్రవారం రోజు ఎవరైతే లక్ష్మీదేవిని సందర్శిస్తారో వారు పూజ సమయంలో అమ్మవారికి తామర పువ్వు సమర్పించాలట. అంతే కాకుండా ఎర్ర గులాబీలు, మందార పువ్వులు సమర్పించినా, అమ్మవారు ప్రసన్నం అయ్యి, మీ సమస్యలను పరిష్కరిస్తారని పండితులు చెబుతున్నారు. కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా అమ్మవారికి సారె అవ్వడం మంచిదట. అయితే అలా ఇవ్వడమే కాకుండా శక్రవారం అమ్మవారిని సందర్శించి, కుంకుమ, బియ్యం, స్వీట్స్ సమర్పిస్తే సంపద పెరుగుతుందని చెబుతున్నారు.

‎కొబ్బరి స్వచ్ఛతకు గుర్తు. ఇది సహజమైన నీటితో నిండి ఉంటుంది. అలాగే అత్యంత స్వచ్ఛమైనది. అయితే లక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యాలలో ఇది కూడా ఒకటి. ఇది సమర్పించడం వలన కూడా అమ్మవారు సంతోషిస్తుందంట. ఇవే కాకుండా, మీర్ ఖీర్, హల్వా, చెరుకు, మఖానా, బటాషా, దానిమ్మ, తమలపాకులు, వంటివి అమ్మవారికి సమర్పించడం చాలా మంచిదని చెబుతున్నారు పండితులు. కాబట్టి పైన చెప్పిన మూడు రకాల వస్తువులు లక్ష్మీదేవికి సమర్పిస్తే అమ్మవారి అనుగ్రహం కలిగి ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతున్నారు.

  Last Updated: 02 Dec 2025, 05:18 AM IST