Naivedyam: భగవంతునికి నైవేద్యం సమర్పించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవే?

సాధారణంగా చాలామందికి భగవంతునికి పెట్టె నైవేద్యంలో విషయంలో అనేక సందేహాలు నెలకొంటూ ఉంటాయి. అలాగే దేవుడిని ఎలా పూజించాలి. దేవునికి ఇష్టమైన నైవ

  • Written By:
  • Publish Date - May 12, 2023 / 05:40 PM IST

సాధారణంగా చాలామందికి భగవంతునికి పెట్టె నైవేద్యంలో విషయంలో అనేక సందేహాలు నెలకొంటూ ఉంటాయి. అలాగే దేవుడిని ఎలా పూజించాలి. దేవునికి ఇష్టమైన నైవేద్యాలు ఫలహారాలు ఏమిటి? అన్న సందేహాలు వ్యక్తం అవుతూ ఉంటాయి. మనలో దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు చాలామంది కొన్ని రకాల పొరపాట్లను చేస్తూ ఉంటారు. తెలిసి తెలియక చేసి కొన్ని పొరపాట్ల వల్ల మనం అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి నైవేద్యం విషయంలో ఎటువంటి విషయాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కాగా మాములుగా దేవుళ్ళకి ఎప్పుడు వెండి, బంగారం, మట్టి లేదా ఇత్తడి పాత్రల్లో నైవేద్యం సమర్పించాలి. ఎందుకంటే అవి పూర్తిగా స్వచ్చమైన లోహాలుగా పరిగణించబడతాయి. నైవేద్యం పెట్టేందుకు అల్యూమినియం, ఇనుము లేదా ఉక్కు పాత్రలు ఎప్పుడు ఉపయోగించరాదు. అలా చేస్తే అది పాపంగా భావిస్తారు. భగవంతుడికి సమర్పించే నైవేద్యం సాత్వికంగా ఉండాలి. అందులో ఉపయోగించే ఆహారాలు అన్ని స్వచ్ఛంగా శాఖాహారం మాత్రమే ఉండాలి. అలాగే ఇప్పుడైనా కూడా దేవుళ్లకు నైవేద్యాలు చేసేటప్పుడు అందులో ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా తయారు చేయాలి. నైవేద్యం చేసే పదార్థాలు కిందపడకూడదు.

ప్రసాదం కోసం తయారుచేసే పదార్థాలు ఇతరులకి ఎప్పుడు దానం చెయ్యకూడదు. అలా చేస్తే చేసిన ప్రసాదం అపవిత్రం అవుతుంది. దేవతల కోసం తయారుచేసే ప్రసాదంలో అల్లం ఉపయోగించుకోవచ్చు. కొంతమందికి తమ ఇంట్లో చేసిన రోజువారీ ఆహారాన్ని దేవతలకు నైవేద్యంగా పెట్టె అలవాటు ఉంటుంది. అలా చేసేటప్పుడు భక్తులే దాన్ని స్వయంగా చేసి ఇతరులకు పెట్టాలి. అది కూడా శుభ్రంగా స్నానం చేసిన తర్వాత ఆహార పదార్థాలు వండాలి. దేవతలకు నైవేద్యంగా పెట్టిన తర్వాత వాటిని తప్పకుండా తినాలి. అంతే కాదు నైవేద్యం అందరికీ పంచి పెట్టాలి. దేవుని ప్రసాదాలు ఎక్కువ సేపు ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూలత వస్తుంది. ప్రసాదం ఇతరులకి పంపిణీ చేయడం వల్ల పూజ చేసిన వాళ్ళకి శుభ ఫలితాలు కలుగుతాయి. పూజ చేసిన ఫలం దక్కుతుంది. అలాగే పూజలో వాడిన పూజా ద్రవ్యాలు, పూలు తప్పనిసరిగా తీసేయాలి. వాటిని చెత్తలో వేయకూడదు. అన్నింటినీ ప్రవహించే నీటిలో మాత్రమే వదిలేయాలి. దీపం మధ్యలోనే కొండెక్కితే తిరిగి అదే దీపం వెలిగించకూడదు. పూజకు ఉపయోగించే దీపారాధన వస్తువులు ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి.