Site icon HashtagU Telugu

Wednesday: బుధవారం రోజు ఈ పనులు చేస్తే చాలు.. అదృష్టం పట్టిపీడించడం ఖాయం!

Wednesday

Wednesday

కొంతమందికి వారంలో కొన్ని రోజులు బాగా సెంటిమెంట్ ఉంటుంది. ఈ రోజున నాకు పని చేస్తే బాగా కలిసి వస్తుందని చాలామంది అనుకుంటారు. అందులో కొంతమంది బుధవారం సెంటిమెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు. మరి మీ లైఫ్ లో కూడా అంతా మంచి జరగాలంటే బుధవారం రోజు ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బుధవారానికి అధిపతి బుధుడు. కాబట్టి ఈ రోజు నవ గ్రహాల్లో బుధుడిని పూజించాలి. అలాగే పెద్ద వాళ్లతో మాట్లాడడానికి బుధవారాన్ని అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు.

అదేవిధంగా కొత్తగా ఎవరైనా వ్యక్తులను కలవాలనుకున్నప్పుడు ఇదే మంచి రోజుగా భావించాలట. కొత్తగా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు అందుకు సంబంధించిన చర్చలు జరపడానికి బుధవారం అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే ఏదైనా సెటిల్​మెంట్ వ్యవహారాలు చేయడానికి ఇది ఉత్తమమైన రోజుగా చెప్పుకోవచ్చని చెబుతున్నారు. వ్యవసాయ పరికరాలు కొనడానికి, వాటిని మొదటి సారి ఉపయోగించడానికి ఇది ఉత్తమమట. అలాగే, వ్యవసాయపరంగా కంది, పెసర, శనగ, మినప, ద్రాక్ష, కమల, బత్తాయి, సీతాఫలం, నిమ్మ, దానిమ్మ వంటి పంటల సాగు బుధవారం మొదలెడితే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. తూర్పు వాయువ్యం, పడమర, నైరుతి, దక్షిణ ఆగ్నేయం దిక్కులలో ఈ రోజు ప్రయాణం చేస్తే అనుకూలమైన ఫలితాలు కలుగుతాయట.

కానీ ఉత్తర, ఈ శాన్యం దిక్కులలో జర్నీ చేస్తే మాత్రం అనారోగ్య సమస్యలు, ధన నష్టం కలిగే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. అందులోనూ మృగశిర, పుష్యమి, అనురాధ, హస్త, మూల, ధనిష్ఠ, శ్రవణ వంటి నక్షత్రాలతో కలిసి వచ్చే బుధవారం నాడు చేసే ప్రయాణాలు ఇంకా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయట. శుక్ల పక్షంలో లేదా బహుళ పక్షంలో తదియ తిథి బుధవారంతో కలిసి వస్తే ఆ రోజు ప్రయాణాలు, ముఖ్యమైన కార్యక్రమాలు చేయకపోవడం మంచిదట. ఇక ఈ రోజు ఆడపిల్ల పుష్పవతి అయితే చాలా మంచిదట. అలాగే ఈ రోజు పుట్టినవారికి 5, 8, 9 వంటి సంఖ్యలను అదృష్ట సంఖ్యలుగా చెప్పవచ్చు. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేస్తే బుధవారం పుట్టినవారికి తొందరగా అదృష్టం కలిసివస్తుందని పండితులు చెబుతున్నారు.