Site icon HashtagU Telugu

Monday: సోమవారం రోజు పొరపాటున కూడా ఈ పనులు అస్సలు చేయకండి.. అదృష్టలక్ష్మి వెళ్లిపోతుందట!

Monday

Monday

వారంలో కొన్ని రోజులు కొన్ని రకాల పనులు చేయడం నిషిద్ధం. అటువంటి వాటిలో సోమవారం రోజు చేసే కొన్ని పనులు కూడా ఒకటి. తెలిసి తెలియకుండా కూడా సోమవారం రోజు కొన్ని రకాల తప్పులు చేయకూడదని ఇలా చేస్తే అదృష్టం లక్ష్మికి కోపం వస్తుందని చెబుతున్నారు. చాలా మంది సోమవారాన్ని సెంటిమెంట్​ గా ఫీలవుతుంటారు. అదృష్టం వరించి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలంటే సోమవారం కొన్ని పనులు చేయకూడట. ఆ పనులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సోమవారం అదృష్టం కలిసిరావాలంటే ఎవరూ నలుపు, బ్లూ కలర్ దుస్తువులు ధరించకూడదట. ఆ రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే మీకు అదృష్టం తగ్గిపోతుందట. అదేవిధంగా పుస్తకాలు, పెన్నులు వంటివి కూడా కొనుగోలు చేయకూడదట. పత్తి కొనకూడదు. దీపారాధన కోసం పత్తితో చేసుకునే వత్తులు ఈ రోజు చేసుకోకూడదట. అందుకు బదులుగా బుధవారం చేసుకోవడం మంచిదని చెబుతున్నారు.

బెండకాయలు, ఆవాలు, పనసకాయ, నల్ల నువ్వులు, మసాలు దినుసులు వంటివి ఆ రోజు తీసుకునే ఆహారంలో ఉండకూడదట. మీరు తినే ఆహార పదార్థాలలో పైన చెప్పినవి లేకుండా చూసుకోవాలని చెబుతున్నారు. ఎటువంటివి చేయాలి అన్న విషయానికి వస్తే.. ఈ రోజు ఏదైనా మొక్క నాటి నీరు పోస్తే త్వరలో మీకు అదృష్టం కలిసివస్తుందట. అలాగే ఏదైనా వెండి వస్తువు సోమవారం కొనడం మంచిదట. కొత్తపనులు ప్రారంభించేటప్పుడు ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్లు, తెలిసిన వారు ఉంటే వారి సలహాలు ఆ రోజున తీసుకోవాలనుకుంటే మంచిదని చెబుతున్నారు. వ్యవసాయదారులు జామ, అరటి, కొబ్బరి వంటి పంటల సాగు ఈ రోజున మొదలెడితే మంచి ఫలితాలు కలుగుతాయిట.