మాములుగా చాలామంది ఇంట్లో ఎంత సంపాదించినా కూడా డబ్బులు మిగలడం లేదని అప్పులు చేయాల్సి వస్తుందని బాధపడుతూ ఉంటారు. ఎంత పొదుపు చేద్దాం అనుకున్నా కూడా సంపాదించిన డబ్బులు చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలడం లేదని బాధపడుతూ ఉంటారు. అయితే అలాంటి వారు ఎప్పుడూ చెప్పినట్టుగా చేస్తే లక్ష్మీ అనుగ్రహం తప్పక కలుగుతుందట. ముఖ్యంగా రాత్రి పూట నిద్రించే సమయంలో కొన్ని ప్రత్యేకమైన పనులు చేయాలట. ఈ పనులు చేస్తే ఆదాయం పెరిగి, ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యకు తలెత్తవట. మరి అందుకోసం ఏమి చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
స్త్రీలు రాత్రి పడుకునే ముందు ఇంట్లోని అన్ని గదుల్లో కర్పూరం వెలిగించి నిద్రపోతే లక్ష్మి అనుగ్రహం లభిస్తుందట. కర్పూరం నవ గ్రహాల్లో శుక్రుడికి సంబంధించినది. పడుకునే ముందు కర్పూరం వెలిగిస్తే ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ ను కలిగించి శుక్రుడి బలాన్ని పెంచి లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుందట.
అలాగే ప్రతి రోజూ రాత్రి రెండు లవంగాలను కాల్చి నిద్రపోవాలట. లవంగాల నుంచి వచ్చే పొగ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీ వచ్చేలా చేస్తుందట. తద్వారా లక్ష్మీ దేవి అనుగ్రహం కలిగి ఇంట్లో ధనం నిలుస్తుందని చెబుతున్నారు.
అలాగే స్త్రీలు పడుకునే ముందు తప్పకుండా నుదుటిన కుంకుమ బొట్టు ధరించి నిద్ర పోవాలట. ఇలా చేస్తే లక్ష్మి అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు. కుబేర స్థానం అయిన ఉత్తర దిక్కున రాత్రి పూట నిద్రపోయే ముందు ఆడేవారు కొన్ని నీళ్లు చిలకరించాలట.. ఈ విధంగా చేస్తే కుబేరుడు అనుగ్రహం లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెబుతున్నారు. అలాగే నైరుతి దిక్కు ఉంటే యజమానికి సంబంధించినది కాబట్టి పడుకునే ముందు నైరుతి దిక్కులో చీకటి లేకుండా చూసుకోవాలట. ఇంట్లో నైరుతి దిశలో చీకటి అనేది ఉండకూడదట. కాబట్టి ఆ దిక్కున లైట్ ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. మహిళలు ప్రతీ శుక్రవారం నిద్రపోయేటప్పు గుమ్మం ముందు అష్టదళ పద్మం ముగ్గు వేసి ఆ తర్వాత నిద్ర పోవాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం కలిగి ధనప్రాప్తి లభిస్తుందట. అదే విధంగా పౌర్ణమి రోజు రాత్రి ఇంటి ముందు అష్టదళం పద్మం ముగ్గు వేయాలని చెబుతున్నారు.
పౌర్ణమి రోజున ఏ ఇంటి ముందు అయితే ముగ్గు ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి సులభంగా ప్రవేశిస్తుందట. అక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకుంటుందని చెబుతున్నారు. రాత్రి నిద్రించే సమయంలో వారానికి ఒక్కసారి అయినా స్త్రీలు ఇంటి గుమ్మం ముందు ఆవ నూనె దీపం వెలిగించినా సరే మంచి జరుగుతుందట. నిద్రపోయే ముందు ప్రతి సోమవారం ఒక పరిహారం చేయాలట. ఒక గాజు పాత్రలో కొద్దిగా రాళ్ల ఉప్పు పోసి పసుపు, కుంకుమ వేసి ఇంట్లో ఎవరికి కనిపించని చోట ఆ గాజు పాత్రను పెట్టాలి. మూడు రోజుల తర్వాత ఆ పాత్రలోని రాళ్ల ఉప్పును ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో పోయాలట. ఈ పరిహారం చేయడం వల్ల ధనం పెరుగుతుందని శ్రీ మహాలక్ష్మీ ఆనంద తాండవం చేస్తుందని చెబుతున్నారు పండితులు.