Vastu Tips: మీ ఇంట్లో ఇవి ఉన్నాయా.. అయితే మీరు ఎంత సంపాదించినా వ్యర్థమే..?

చాలామంది వాస్తు శాస్త్రాన్ని నమ్ముతూ ఉంటారు. ఇంకొంతమంది ప్రతి ఒక్క విషయంలోనూ అంటే ఇంటిని

  • Written By:
  • Publish Date - September 15, 2022 / 06:30 AM IST

చాలామంది వాస్తు శాస్త్రాన్ని నమ్ముతూ ఉంటారు. ఇంకొంతమంది ప్రతి ఒక్క విషయంలోనూ అంటే ఇంటిని నిర్మించినప్పటి నుంచి కిటికీలు,గది,బీరువా బెడ్ రూమ్ వరకు ప్రతి ఒక్క విషయంలో వాస్తు శాస్త్రాన్ని పాటిస్తూ ఉంటారు. వాస్తు శాస్త్ర ప్రకారమే నడుచుకుంటారు. అయితే ఈ శాస్త్ర ప్రకారం కొన్ని వస్తువులని ఇంట్లో పెడితే మంచి జరిగితే మరికొన్నింటిని అస్సలు ఉంచకూడదట. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మా ఇంటి ముఖద్వారం మీద గణేశుడు విగ్రహం ఉండటం వల్ల ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. గణేష్ విగ్రహం ఇంటి ముందు ఉండటం వల్ల చాలా మంచిది.

ముఖ ద్వారం మీద వినాయకుడు విగ్రహం ఉండటం వల్ల ఇంటికి ఆనందాన్ని శాంతిని తీసుకువస్తాడు అని నమ్మకం. అలాగే బుద్ధ విగ్రహం శాంతి, ఆనందానికి ప్రతీక అని చెబుతూ ఉంటారు. మీ ఇంట్లో ఒక్క విగ్రహం అయినా బుద్దుడిది ఉండడం మంచిది. బాల్కనీ, లివింగ్ రూమ్ ఎక్కడైనా గుద్ధ విగ్రహాన్ని పెట్టొచ్చు. బుద్ధుడి విగ్రహం పెట్టడం వల్ల ఇంటికి అందమే కాదు.. ప్రశాంతతో పాటు ఎప్పుడు సంతోషకర వాతావరణం ఉంటుంది. ఇంట్లో అక్వేరియంలో పెంచుకుంటున్న చేపలు, అక్వేరియం ప్రవహించే నీటి వనరులే. ఇవి సానుకూలత, జీవనోపాధిని సూచిస్తాయి. మీ లింగ్ రూమ్‌లో ఉత్తరం, తూర్పున అక్వేరియాన్ని ఉంచడం మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా వంట గదిలో మనము ఉపయోగించే మెడిసిన్స్ పెట్టే అలవాటు ఉంటే దానిని వెంటనే మానుకోండి.

వంటగది అనేది మీకు ఆహారాన్ని అందించే స్థలం. ఔషధాలను నెగెటీవ్ బెనిఫిట్స్ కోసం వాడతారు కాబట్టి గదిలో మెడిసిన్స్ ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతారు. పడక గదిలో అద్దాలు ఉంచడం అంత మంచిది కాదు. ఇలా పెట్టడం వల్ల కుటుంబ కలహాలు విభేదాలు తరచుగా వస్తూ ఉంటాయట. అలాగే నిద్రపోయే ప్రదేశంలో అద్దం ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయట. అలాగే ఇంట్లో తులసి మొక్కను పెంచడం ద్వారా వాస్తు ప్రకారం చాలా మంచిది. తులసి మొక్క ఇంటి ఆవరణలో ఉంటే స్వచ్ఛమైన గాలిని తీసుకువస్తుంది.