ఈ ఏడాది అనగా 2024లో అక్టోబర్ 31వ తేదీన దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకోనున్నారు. దీపావళి అంటేనే దీపాల పండుగ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ దీపావళి పండుగ రోజున ప్రతి ఒక్కరు ఇంటిని అందంగా దీపాలతో అలంకరించి టపాసులు పేలుస్తూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అలాగే లక్ష్మీదేవిని ప్రత్యేకంగా భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అయితే ఈ రోజున కొన్ని రకాల జంతువులను పక్షులను చూడడం శుభసూచికంగా భావించాలని చెబుతున్నారు పండితులు. మరి దీపావళి పండుగ రోజు ఎలాంటి జంతువులు పక్షులు చూస్తే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
గుడ్లగూబ.. లక్ష్మీ దేవి వాహనంగా చెప్పుకునే గుడ్లగూబ దీపావళి రోజున చూడటం వల్ల వారికీ అలాగే ఆ ఇంటికి ఎంతో శ్రేయస్కరం అని చెబుతున్నారు. దీపావళి రోజున గుడ్లగూబను చూస్తే, సంపదలకు దేవత అయిన లక్ష్మీ దేవి మిమ్మల్ని కరుణించబోతుందని అర్థమట.
దీపావళి పండుగ రోజు చూడాల్సిన జంతువులలో ఆవు కూడా ఒక్కటి. హిందూ మతంలో ఆవును కూడా చాలా పవిత్రంగా భావిస్తారు. గోవుకు తల్లి హోదా కల్పించారు. దీపావళి రోజున ఆవు మీ ఇంటికి వస్తే శుభప్రదమట. ఈ దీపావళి రోజున ఆవును చూస్తే మీ జీవితంలో కొన్ని సానుకూల మార్పులు సంభవించవచ్చని చెబుతున్నారు.
అలాగే దీపావళి పండుగ రోజు పిల్లి కనిపించడం అన్నది శుభ సూచికంగా భావించాలట. పిల్లి కనిపించడం, మీ దారికి అడ్డుగా రావడం అశుభంగా భావించినప్పటికీ, దీపావళి రోజున పిల్లిని చూడటం శుభసూచకాలను ఇస్తుందట. ఈ రోజు మీరు పిల్లిని చూస్తే, మీరు లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందబోతున్నారని అర్థం అని చెబుతున్నారు.
అలాగే ఏనుగు శ్రేయస్సు, పదునైన తెలివితేటలకు చిహ్నంగా పరిగణిస్తారు. అయితే ఈ దీపావళి రోజున మీరు ఏనుగును చూస్తే, అది మీ జీవితంలో మంచి మార్పులకు సంకేతంగా భావించాలని పండితులు చెబుతున్నారు.
ఆపగా దీపావళి పండుగ సమయంలో చిట్టెలుక కనిపించడం కూడా చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుందట. ఇది మీ ఆదాయంలో పెరుగుదలను సూచిస్తుందట. దీపావళి రోజు రాత్రి ఎలుక కనిపిస్తే సంతోషించాలి అంటున్నారు. శకున్ శాస్త్రం ప్రకారం ఎలుక దర్శనం డబ్బు రాకకు సూచిక. దీపావళి రోజు ఎలుక కనిపిస్తే తరిమికొట్టకూడదట. దానిని శుభసూచకంగా భావించాలని చెబుతున్నారు.