జ్యోతిష్య శాస్త్రంలో ఆదివారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే ఈరోజు చేసే పరిహారాలు చాలా మంచి ఫలితాలను ఇస్తాయని పండితులు చెబుతున్నారు. అందులో భాగంగానే అదృష్టం సంపద పెరగాలి అనుకున్న వారు ఆదివారం రోజు తప్పకుండా కొన్ని రకాల పరిహారాలు పాలించాలట. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే.. ఆదివారం రోజు సూర్య భగవానుడికి అంకితం చేయబడింది కాబట్టి ఆయనకు ఇష్టమైన ఎరుపు రంగు దుస్తులు ధరించడం వల్ల అదృష్టం పెరుగుతుందట.
అలాగే మీరు ఏదైనా పనిమీద ఆదివారం రోజు బయటికి వెళుతున్నప్పుడు నుదుటిన కచ్చితంగా గంధపు తిలకాన్ని పెట్టుకొని బయటకు వెళ్లడం వల్ల వెళ్ళిన పని సక్సెస్ అవుతుందట. ఇది మీ పనిలో విజయాన్ని పొందడానికి సహాయపడుతుందట. ఆదివారం నాడు అవసరమైన వారికి మీరు బియ్యం, పాలు, బెల్లం, బట్టలను దానం చేయవచ్చట. వీటిని దానం చేయడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహాన్ని పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాదు మీరు చేపట్టిన పనులన్నీ సక్రమంగా పూర్తవుతాయట. అలాగే తప్పకుండా విజయం సాధిస్తారని చెబుతున్నారు.
అలాగే మీ సంపద కూడా పెరుగుతుందట. ఇంట్లో ఆనందం వెళ్లి విరుస్తుందని చెబుతున్నారు. ఆదివారం రోజున సూర్యభగవానుడికి అర్ఘ్యం ను సమర్పించాలని చెబుతున్నారు. అయితే మీరు అర్ఘ్యం చేసేటప్పుడు ఓం సూర్యాయ నమ:, ఓం వాసుదేవాయ నమ: ఓం ఆదిత్య నమం: అనే మంత్రాలను పఠించాలని చెబుతున్నారు. ఈ విధంగా పైన చెప్పిన పరిహారాలు ఆదివారం రోజు పాటిస్తే తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయని విజయం సాధించవచ్చు అని చెబుతున్నారు.