Maha Shivratri 2024: శివ పూజలో పొరపాటున కూడా వీటిని ఉపయోగించకండి?

నేడే శివరాత్రి.. ఈరోజు పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున భక్తులు ఆ పరమేశ్వరుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేయిస్తూ ఆయనకు ఇష్టమైనవన్

  • Written By:
  • Updated On - March 8, 2024 / 04:36 PM IST

నేడే శివరాత్రి.. ఈరోజు పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున భక్తులు ఆ పరమేశ్వరుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేయిస్తూ ఆయనకు ఇష్టమైనవన్నీ కూడా సమర్పిస్తూ ఉంటారు. కొందరు జాగరణ చేస్తూ ఉపవాసం కూడా ఉంటారు. అయితే ఇవన్నీ చేయడం మంచిదే కానీ శివ పూజలో పొరపాటున కూడా కొన్నింటిని అస్సలు ఉపయోగించకూడదు. మరి శివ పూజలో ఏమి ఉపయోగించకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తులసి.. శివ పూజలో తులసి అనేది నిషిద్ధం. తులసి కేవలం విష్ణు పూజలోనే ఉపయోగించాలి.

మహా శివరాత్రికి మాత్రమే కాదు. సాధారణ రోజుల్లో కూడా శివుడి పూజకు తులసిని వినియోగించకూడదు. అలాగే పసుపు అనేది పరమ పవిత్రమైనది. ఇంట్లో ఏ శుభకార్యం తలపెట్టినా పసుపు అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. కానీ శివ పూజలో మాత్రం పసుపును వినియోగించకూడదు. పసుపు అనేది స్త్రీలకు సంబంధించింది. అందుకే పరమేశ్వరుడి పూజలో ఉపయోగించరు. పసుపును అసలు శివ లింగానికి పూయరు. సింధూరం.. సింధూరాన్ని కూడా శివుడి పూజలో ఉపయోగించరు. సింధూరాన్ని తమ భర్త సుదీర్ఘకాలం పాలు బతకాలను స్త్రీలు నుదిటిపై ధరిస్తారు. అయినా సింధూరాన్ని పొరపాటున కూడా శివ పూజలో ఉపయోగించరు.

విరిగిన బియ్యం.. విరిగిన బియ్యాన్ని కూడా పరమేశ్వరుడి పూజలో ఉపయోగించరు. విరిగిన బియ్యంతో అక్షింతలను కూడా వాడరు. విరిగిన బియ్యాన్ని హిందూ మతంలో అశుభంగా భావిస్తారు. శంఖం.. అదే విధంగా శంఖాన్ని కూడా శివయ్య పూజలు వాడరు. ఈ శంఖంలో శంఖుడు అనే రాక్షసుడు నివసిస్తాడు. అందుకే మహా శివరాత్రి రోజు శంఖంతో నీటిని శివ పూజలో ఉపయోగించరు. ఇలా కొన్ని రకాల వస్తువులను పరమేశ్వరుడి పూజలో వాడరు. వీటికి అనేక కథలు కూడా ప్రాచూర్యంలో ఉన్నాయి.