Offerings To God: దేవుడికి నైవేద్యం పెడుతున్నారా.. అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి?

భారతదేశంలో హిందువులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. వాస్తు శాస్త్రాలలో వారంలో ఏ

  • Written By:
  • Publish Date - March 21, 2023 / 06:00 AM IST

భారతదేశంలో హిందువులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. వాస్తు శాస్త్రాలలో వారంలో ఏ రోజు ఏ దేవుడిని పూజించడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే దేవుడిని ఎలా పూజించాలి. దేవునికి ఇష్టమైన నైవేద్యాలు ఫలహారాలు ఏమిటి అన్న విషయాలను వివరించిన విషయం తెలిసిందే. మనలో దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు చాలామంది కొన్ని రకాల పొరపాట్లను చేస్తూ ఉంటారు. తెలిసి తెలియక చేసి కొన్ని పొరపాట్ల వల్ల మనం అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి నైవేద్యం విషయంలో ఎటువంటి విషయాలు పాటించాలి?

ఎటువంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. దేవుళ్ళు మనం పెట్టిన నైవేద్యాన్ని స్వీకరిస్తాడని భావిస్తారు. మనం ఒక్కో దేవుడికి ఒక్కో ప్రసాదాన్ని సమర్పిస్తాం. అయితే నైవేద్యాన్ని సమర్పించే సమయంలో కొన్ని విషయాలను తప్పకుండ గుర్తుంచుకోవాలి. ఆ సమయంలో తప్పులు చేస్తే దేవుడి నిరాదరణకు గురి అవుతారు. కొంతమంది దేవుడికి నైవేద్యం సమర్పించిన వెంటనే తీసేస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు కొద్దీ సేపు దేవుడి దగ్గర వదిలేసి ఆ తర్వాత ప్రసాదాన్ని తీసుకోవాలి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడికి తయారు చేసే పదార్ధాలను నూనెతో తయారు చేయకూడదు. కేవలం నెయ్యితో చేసిన ప్రసాదాలను మాత్రమే దేవుడికి నైవేద్యంగా పెట్టాలి.

అలాగే నైవేద్యం కోసం కేవలం నెయ్యిని మాత్రమే ఉపయోగించాలి. అలాగే మిరప కాయలతో చేసిన పదార్ధాలను దేవుడికి సమర్పించకూడదు. వండిన ఆహారాన్ని మాత్రమే దేవుడికి సమర్పించాలి. ఆ తర్వాత మీరు ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. అయితే అంత కంటే ముందుగా ఆ ప్రసాదాన్ని ఆవుకి పెట్టాలి. ఆవుకి నైవేద్యంగా పెట్టిన తర్వాత మీరు తినడం వల్ల దేవతలు చాలా సంతోషిస్తారు.