Site icon HashtagU Telugu

Shani Dev: పొరపాటున కూడా అలాంటి తప్పులు అస్సలు చేయకండి.. చేశారంటే శని ఆగ్రహానికి గురవ్వాల్సిందే?

Mixcollage 27 Dec 2023 04 25 Pm 1948

Mixcollage 27 Dec 2023 04 25 Pm 1948

మామూలుగా శని దేవుడిని న్యాయ దేవుడుగా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే మన కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటారు. మంచి పనులు చేసే వారికి మంచి ఫలితాలు చెడు పనులు చేసే వారికి చెడ్డ ఫలితాలను ఇవ్వడంతో పాటు వారికి అష్ట కష్టాలను అనుభవించేలా చేస్తూ ఉంటాడు శనీశ్వరుడు. అందుకే ఎల్లప్పుడూ మంచి పనులు చేయాలని చెబుతూ ఉంటారు. చెడు పనులు చేసే వారిని శని దేవుడు తప్పకుండా శిక్షిస్తూ ఉంటాడు. అలాగే మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల శని దేవుని ఆగ్రహానికి లోనవ్వక తప్పదు. మరి ఎలాంటి పొరపాట్లు చేస్తే శనీశ్వరుడి ఆగ్రహానికి గురవుతారు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శని దేవుడు సూర్య పుత్రుడు.

శని కర్మకు తగిన ఫలితాన్ని ఇచ్చేవాడు. సూర్య పుత్రుడైన మరో దేవత యమ ధర్మరాజు. యముడు మృత్యుదేవత. మరణానంతరం వారి సద్గతులను నిర్ణయిస్తాడు. శనిని ప్రసన్నం చేసుకున్న వారు తమ లక్ష్యాలను ఛేదిస్తారని నమ్మకం. శని కరుణ పొందాలంటే కొన్ని పనులు తప్పక చెయ్యాలని పురాణాలు చెబుతున్నాయి. కొన్ని పనులు శనిని ప్రసన్నం చేసుకోవడానికి ఉపయోగపడితే మరికొన్ని పనులు చెయ్యడం వల్ల శనికి కోపం రావచ్చు. ఎలాంటి పనులు చేయవద్దు అన్న విషయానికి వస్తే.. బాత్ రూములు మురికిగా పెట్టుకోవద్దు. కాస్త మురికిగా అయినా సరే వెంటనే శుభ్రం చేసుకోవాలి. లేదంటే శని ఆగ్రహానికి గురికావల్సి రావచ్చు. టాయిలెట్ ఉపయోగించిన తర్వాత మురికిగా వదిలెయ్యడం కూడా అసలు చెయ్యకూడదు.

పెద్దవారిని, నిస్సహాయులను ఎప్పుడూ అవమానించరాదు. అగౌరవ పరచకూడదు. ఇలా చేస్తే శని వేసే దారుణమైన శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. చేసిన అప్పు ఉద్దేశ్య పూర్వకంగా తీర్చకపోతే మీరు శని కోపానికి గురికావల్సి వస్తుంది. రుణం తీసుకున్న వారు వీలైనంత త్వరగా దాన్ని తీర్చుకోవడం మంచిది. కుర్చిలో కూర్చుని పాదాలు ఊపే అలవాటు కూడా మంచిది కాదు. ఇలా కూర్చుని అవసరం లేకుండా పాదాలు కదిపే అలవాటు అసలు మంచిది కాదు. ఈ చర్య జీవితాన్ని ఉద్రిక్త పరిచేందుకు కారణం అవుతుంది. పాదాలు ఈడుస్తూ నడవడం అసలు మంచిది కాదు. ఇలా నడిచే వారిని శని అసలు వదిలిపెట్టడు. ఇలా చేస్తే తప్పనిసరిగా పూర్తవుతాయని అనిపించే పనులకు కూడా ఆటంకాలు ఏర్పడతాయి. రకరకాలుగా ఆర్థిక సంక్షోభాలు చుట్టుముడుతాయి. అలాగే రాత్రి తిన్న తర్వాత వంట గదిలో ఎంగిలి పాత్రలు వదిలెయ్యడం అంత మంచిది కాదు. వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం మంచిది. లేదంటే వాటిని కడిగేందుకు బయట పెట్టుకోవాలి. ఎంగిలి పాత్రలు ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీని ఆకర్శిస్తాయి. ఇలాంటి అలవాటు ఉంటే వెంటనే సరిచేసుకోవడం అవసరం.

Exit mobile version