Shani Dev: పొరపాటున కూడా అలాంటి పనులు చేస్తే.. శని ఆగ్రహానికి గురవడం ఖాయం?

శనిశ్వరుడు.. ఈ పేరు వినగానే చాలామంది బయపడిపోతుంటారు. శనిశ్వరుడిని పూజించాలి అన్న, ఆయన గుడికి వెళ్ళాలి అన్నా కూడా తెగ బయపడుతూ ఉంటారు. అయితే

  • Written By:
  • Publish Date - July 2, 2023 / 09:41 PM IST

శనిశ్వరుడు.. ఈ పేరు వినగానే చాలామంది బయపడిపోతుంటారు. శనిశ్వరుడిని పూజించాలి అన్న, ఆయన గుడికి వెళ్ళాలి అన్నా కూడా తెగ బయపడుతూ ఉంటారు. అయితే మంచి పనులు చేసేవారికీ ఎప్పుడు కూడా ఆ శని దేవుని ఆశిసులు తప్పకుండా ఉంటాయి. పొరపాటున కూడా శనికి కోపం తెప్పించే ప్రయత్నాలు చేస్తే ఆయన కోపం అష్టకష్టాల పాలు చేస్తుంది. అలాగే శని దేవుడి ఎన్ని కష్టాలను ఇస్తాడో అంతకు రెండింతలు ఐశ్వర్యం, డబ్బులు ఇస్తాడు. శని దేవుడు సూర్య పుత్రుడు. శని కర్మకు తగిన ఫలితాన్ని ఇచ్చేవాడు. సూర్య పుత్రుడైన మరో దేవత యమధర్మరాజు.

యముడు మృత్యుదేవత. మరణానంతరం వారి సద్గతులను నిర్ణయిస్తాడు. శనిని ప్రసన్నం చేసుకున్న వారు తమ లక్ష్యాలను ఛేదిస్తారని నమ్మకం. శని కరుణ పొందాలంటే కొన్ని పనులు తప్పక చెయ్యాలని పురాణాలు చెబుతున్నాయి. కాగా పొరపాటున కూడా ఇలాంటి పనులు చేయకూడదు. ఎల్లప్పుడూ బాత్ రూములను మురికిగా పెట్టుకోకూడదు. కాస్త మురికిగా ఉన్న సరే వెంటనే శుభ్రం చేసుకోవాలి. లేదంటే శని ఆగ్రహానికి గురికావాల్సి రావచ్చు. టాయిలెట్ ఉపయోగించిన తర్వాత మురికిగా వదిలెయ్యడం కూడా అసలు చెయ్యకూడదు. అలాగే మనకంటే పెద్దవారిని, నిస్సహాయులను ఎప్పుడూ అవమానించకూడదు.

అగౌరవ పరచకూడదు. పొరపాటున అయినా అలా చేస్తే శని వేసే దారుణమైన శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. అదేవిధంగా చేసిన అప్పు ఉద్దేశ్యపూర్వకంగా తీర్చకపోతే మీరు శని కోపానికి గురికావాల్సి వస్తుంది. అలాగే రుణం తీసుకున్న వారు వీలైనంత త్వరగా దాన్ని తీర్చేసుకోవడం మంచిది. పాదాలు, చెప్పులు ఈడుస్తూ నడవడం అసలు మంచిది కాదు. ఇలా నడిచే వారిని శనిదేవుడు అసలు వదిలిపెట్టడు. అలా చేస్తే పనులకు కూడా ఆటంకాలు ఏర్పడతాయి. ఆర్థిక సంక్షోభాలు కూడా చుట్టుముడుతాయి. చాలామంది కుర్చిలో లేదా మంచంపై కూర్చొని పాదాలు ఊపకూడదు. రాత్రి పూట పడుకునే ముందు వంట గదిలో ఎంగిలి పాత్రలు వదిలెయ్యడం మంచిది కాదు. రాత్రి పూట ఆ ఎంగిలి పాత్రలు శుభ్రం చేసి పడుకోవడం మంచిది. లేదంటే వాటిని ఇంటి బయట పెట్టడం మంచిది.

ఎంగిలి పాత్రలు ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీని ఆకర్శిస్తాయి. ఇకపోతే శని అనుగ్రహం కోసం కోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే.. నల్లని బట్టలు, ఆవాలు, నూనె దానం చెయ్యడం, అవసరమైన వారికి దానం చెయ్యడం వల్ల రుణ కర్మలను కొంత వరకు తీర్చుకోవచ్చు. ఆకలిగా ఉన్న వారికి ఆహారం అందించడం, ఇంట్లో వండిన దాన్ని ఆకలిగా ఇంటికి వచ్చిన వారికి ప్రేమగా వడ్డించడం. అందరినీ గౌరవంగా చూడడం, ఆఫీసులో లేదా మీ దగ్గర పనిచేసే వారిని చులకన చెయ్యకుండా అవమాన పరచకుండా గౌరవంగా మాట్లాడటం లాంటివి చేయడం వల్ల తప్పకుండా శని అనుగ్రహం కలుగుతుంది. అలాగే కాకి శనికి వాహనం కాబట్టి కాకులకు ఆహారం, నీళ్లు అందించడం. శనివారం రోజున కాకులకు ఆహారం అందిస్తే విశేష ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం, వ్యాయామం చెయ్యడం ఇలాంటి క్రమశిక్షణ కలిగిన జీవన శైలి జీవితంలో శని అనుగ్రహం తప్పక లభిస్తుంది.