Lakshmi Devi: లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే మీ పూజ గదిలో ఇవి ఉండాల్సిందే?

మాములుగా ప్రతి ఒక్కరు ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదని కోరుకుంటూ ఉంటారు. అయితే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండకూడదు అంటే లక్ష్మీదేవి అనుగ్ర

  • Written By:
  • Publish Date - June 21, 2024 / 12:52 PM IST

మాములుగా ప్రతి ఒక్కరు ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదని కోరుకుంటూ ఉంటారు. అయితే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండకూడదు అంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగింది అంటే చాలు ఎంత బీదవారైనా సరే కోటీశ్వరులు అవ్వాల్సిందే. మరి లక్ష్మీ అనుగ్రహం కలగాలి అంటే తప్పకుండా కొన్ని రకాల విధివిధానాలను పాటించాలి. లక్ష్మి అనుగ్రహం కోసం చాలా మంది ఎన్నో పూజలు పరిహారాలు పాటిస్తూ ఉంటారు. అలాగే ఎన్నో రకాల పూజలు కూడా చేస్తుంటారు. వాటితో పాటు లక్ష్మి అనుగ్రహం కోసం కలగాలి అంటే పూజ గదిలో కొన్ని ఉండాల్సిందే అంటున్నారు పండితులు.

అవేంటో ఇప్పుడు మనము తెలుసుకుందాం.. లక్ష్మీదేవిని సంపదకు అధిదేవతగా భావిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రావని నమ్ముతారు. అంతేకాదు లక్ష్మీదేవి కటాక్షం పొందితే ఇంట్లో డబ్బుకు ఏ లోటూ ఉండదట. నెమలి ఈకలను మీ ఇంట్లోని పూజ గదిలో పెట్టాలి. దీనివల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. వీటితో పాటుగా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందుతారు. అలాగే మీ సంతోషం, శ్రేయస్సు పెరుగుతాయి. అలాగే లక్ష్మీదేవిని నిష్టగా పూజించాలి. అలాగే మీ ఇంట్లో పూజ గదిలో గంగాజలాన్ని కూడా ఉంచడం కూడా మంచిదే.

ఎందుకంటే హిందూమతంలో గంగాజలాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అందుకే గంగాజలాన్ని మమీ ఇంట్లోని పూజ గదిలో పెట్టాలి. దీంతో లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది. హిందూ మతంలో శంఖాన్ని కూడా చాలా పవిత్రంగా భావిస్తారు. దక్షిణ శంఖాన్ని లక్ష్మీదేవికి ఇష్టమైనదిగా భావిస్తారు. ఇలాంటప్పుడు ఈ శంఖంలో గంగాజలాన్ని నింపి ఇంటి గుడిలో పెట్టవచ్చు. దీనివల్ల మీరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. శివలింగం శివునికి చిహ్నం. అందుకే మీ ఇంటి గుడిలో ఒక శివలింగాన్ని తప్పకుండా పెట్టాలి. అలాగే క్రమం తప్పకుండా శివలింగాన్ని ఆరాధించాలి. శివలింగానికి క్రమం తప్పకుండా నీటిని సమర్పించడం వల్ల మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. హిందూ మతంలో మొదట పూజించే దేవుడు వినాయకుడు. అందుకే వినాయకుడి విగ్రహాన్ని మీ ఇంట్లోని పూజా గదిలో తప్పకుండా ఉంచాలి.