Site icon HashtagU Telugu

Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా నుంచి వీటిని తెచ్చుకుంటే చాలు.. దరిద్రం వదిలి వెళ్ళిపోవాల్సిందే!

Maha Kumbh Mela

Maha Kumbh Mela

ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రయాగ్‌ రాజ్‌ లో కొనసాగుతున్న మహాకుంభమేళాలో త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది, కొట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. గంగా, యమునా, అదృశ్య సరస్వతి నదుల సంగమం హిందూ మతంలో చాలా పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఈ సంగమంలో 144 ఏళ్లకొకసారి వచ్చే మహా కుంభమేళా సమయంలో స్నానం చేయడం వల్ల పాపాలు నశించడమే కాకుండా జీవితంలో సానుకూలత, ప్రశాంతత లభిస్తాయని భక్తుల విశ్వాసం. ఇక్కడికి వచ్చే భక్తులు పవిత్ర స్నానం చేయడమే కాకుండా సాధువుల ఉపన్యాసాలు, మతపరమైన ఆచారాలలో కూడా పాల్గొంటారు.

ప్రయాగ్‌ రాజ్‌ లో జనవరి 13న మహాకుంభమేళా ప్రారంభమవగా ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. మహా కుంభమేళాకి వెళ్లినవారు తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు కొన్నింటిని తమ వెంట తెచ్చుకోవడం శుభప్రదం అని పండితులు సూచిస్తున్నారు. మరి మహా కుంభమేళా నుంచి ఇంటికి ఎలాంటి వస్తువులు తెచ్చుకోవాలి అన్న విషయానికి వస్తే.. పవిత్ర మట్టి త్రివేణి సంగమం నేల అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. సంగం నుండి తెచ్చిన మట్టిలో సానుకూల శక్తి ఉంటదని, ఇది ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంచుతుందట. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర లేదా పూజా స్థలంలో ఈ మట్టిని ఉంచడం వల్ల ప్రతి కూల శక్తి నశించి,సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుందట. శివలింగం మహా కుంభం నుండి శివ లింగం లేదా పరాస్ రాయిని తీసుకురావడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

ఇంట్లో పూజా స్థలంలో దీనిని ప్రతిష్టించడం వల్ల కుటుంబానికి సుఖం, శాంతి, సౌభాగ్యం కలుగుతాయట. సలహా తులసి ఆకులు తులసి మొక్కదాదాపు ప్రతి హిందూ కుటుంబం ఇంట్లో కనిపిస్తుంది. మహా కుంభంలో తులసి ఆకుల ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. ఇక్కడి నుంచి తులసి ఆకులను తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఇంట్లోని దారిద్య్రం తొలగిపోయి ఆర్థికాభివృద్ధికి బాటలు పడతాయని చెబుతున్నారు. తులసిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. దానిని ఇంట్లో ఉంచడం వల్ల సానుకూలత ఉంటుందట. హిందూ మతంలో గంగాజలం స్వచ్ఛత, పవిత్రతకు చిహ్నంగా పరిగణించబడుతుంది. మహాకుంభమేళా సమయంలో సంగమంలోని నీరు మరింత పవిత్రంగా మారుతుంది. దీనిని ఇంటికి తెచ్చి పూజా స్థలంలో ఉంచడం వల్ల కుటుంబ కలహాలు తొలగిపోయి ఇంట్లో శాంతి, సౌభాగ్యం కలుగుతాయి. ఇది మాత్రమే కాకుండా గంగాజలం మతపరమైన ఆచారాలు, పూజలలో ఉపయోగించబడుతుందని పండితులు చెబుతున్నారు.