కొందరు ఎంత సంపాదించినా కూడా డబ్బులు చేతిలో మిగడం లేదని, సమస్యలు వెంటాడుతున్నాయని బాధపడుతూ ఉంటారు. కొందరు మాత్రం తక్కువ ఆదాయంతోనే సంతోషంగా గడుపుతూ ఉంటారు. అయితేఆర్థిక పరిస్థితుల విషయంలో ఎప్పుడైనా తెలివిగా వ్యవహరించాలని చెబుతూ ఉంటారు. వాటితో పాటుగా మన ఇంటి వాస్తు అలాగే రాశులు వాస్తు దోషాలు కూడా మనపై ఎంతో కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. చాలామంది మంచి స్థాయిలో ఉండాలని అభివృద్ధి కోసం రాత్రి పగలు తెగ కష్టపడుతూ ఉంటారు. ఎంత కష్టపడినా కూడా ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి అంటే లక్ష్మీ కటాక్షం తక్కువగా ఉంది అని అర్థం. ఆర్థిక సమస్యల నుంచి గట్టేక్కించాలి అంటే తప్పకుండా లక్ష్మీ కటాక్షాన్ని పొందాలి.
మరి లక్ష్మీ కటాక్షం పొందడానికి రాత్రి సమయంలో ఎటువంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రాత్రి సమయంలో పడకగదిలో కర్పూరాన్ని వెలిగించాలి. ఈ విధంగా చేయడం వల్ల బెడ్ రూమ్ వాతావరణం స్వచ్ఛంగా ఉండడంతో పాటు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా లభిస్తుంది. అలాగే రాత్రి సమయంలో పడుకునేటప్పుడు వంట గదిలో ఉన్న పాత్రలు అన్ని శుభ్రం చేసి పడుకోవాలి. ఆ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. కానీ చాలామంది రాత్రి సమయంలో తిన్న సామాన్లను అలాగే పెట్టి పడుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అంతేకాకుండా నెగటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. రాత్రి సమయంలో మురికి పాత్రలు అలాగే ఉండడం వల్ల ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. అందుకే రాత్రి సమయంలో తిన్న పాత్రలు శుభ్రం చేసిన తర్వాత నిద్రపోవాలి.
అదే విధంగా ప్రతిరోజు సాయంత్రం ప్రధాన ముఖ ద్వారం వద్ద నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించడంతోపాటు లక్ష్మీ ఎప్పుడూ ఇంట్లోనే కొలువై ఉంటుంది. సాయంత్రం సమయంలో దానధర్మాలు చేయకూడదు. సాయంత్రం సమయంలో దానధర్మాలు చేయడం వల్ల అది పేదరికానికి దారి తీస్తుంది. రాత్రి సమయంలో పాలు, పెరుగు,ఉప్పు ఇతరులకు ఇవ్వకూడదు. ఈ విధంగా చేయడం వల్ల ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారుతుంది. అలాగే రాత్రి సమయంలో ఇంటి గుమ్మం కి ఎదురుగా చెప్పులు తీసేయాలి. ఇంటి మెయిన్ డోర్ ని కూడా శుభ్రం చేయాలి. రాత్రి సమయంలో పడుకోడానికంటే ముందు కాళ్లు చేతులు కడుక్కొని ఇంటి దేవతను లేదంటే మీ ఇష్ట దేవతను స్మరించుకొని పడుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మంచి నిద్ర రావడంతో పాటు పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. అలాగే రాత్రి సమయంలో బాత్రూంలో బకెట్ ఖాళీగా ఉంచకుండా నిండుగా ఉంచడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది.