Dishti: దిష్టి తగిలినప్పుడు ఏం చేయాలి.. ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసా?

మామూలుగా కొంచెం అందంగా రెడీ అయినప్పుడు దిష్టి తగులుతుంది జాగ్రత్త అని చెబుతూ ఉంటారు. దిష్టి లో కూడా అనేక రకాల దృష్టిలో ఉన్నాయి అన్న విషయం మ

  • Written By:
  • Publish Date - December 31, 2023 / 09:00 PM IST

మామూలుగా కొంచెం అందంగా రెడీ అయినప్పుడు దిష్టి తగులుతుంది జాగ్రత్త అని చెబుతూ ఉంటారు. దిష్టి లో కూడా అనేక రకాల దృష్టిలో ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎప్పుడైనా ఇంటికి నరదృష్టి తగిలిందని అంటూ ఉంటారు. అలాగే ఇంట్లో ఎవరో ఒకరు తరుచుగా అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే దిష్టి తగిలిందని వెంటనే దిష్టి తీయించుకోమని చెబుతూ ఉంటారు. మరి దిష్టి తగిలినప్పుడు ఏం చేయాలి? దిష్టిని వదిలించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

దిష్టి వల్ల ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు అనారోగ్యం బారిన పడుతుంటే సముద్రపు నీటిని ఒక శుభ్రమైన బట్టతో వడగట్టి అందులో గోమూత్రం కలిపి ఒక సీసాలో నిల్వ చేసి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని పౌర్షమి రోజున, పాడ్యమి రోజున ఇంట్లోని అన్ని గదుల్లో కొద్దికొద్దిగా చిలకరించుకోవాలి. ఇలా చేస్తే ఇంటికి తగిలిన దిష్టి పోతుంది. అలాగే వ్యాపారం చెడు దృష్టి పాలైందని అనుమానం కలిగితే వెంటనే నిమ్మకాయను గాజు గ్లాసులో నీళ్లు పోసి అందులో వేసి అందరూ వచ్చి వెళ్లే చోట పెట్టాలి. ఇందులో నీటిని ప్రతి రోజూ మార్చాలి.

నిమ్మకాయను ప్రతి శనివారం మార్చాలి. పసి పిల్లలు ఇంటికి ఎవరైనా వచ్చి వెళ్లిన తర్వాత ఎడతెగకుండా ఏడుస్తుంటే ఉప్పు చేతిలోకి తీసుకొని వారి తలచుట్టూ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ మూడు సార్లు తిప్పి ఆ ఉప్పును నీటిలో వేసెయ్యాలి. దురదృష్టం వెంటాడుతుంటే ఇంట్లో హాల్ లో పడమటి వైపు అక్వేరియం పెట్టుకుంటే ఫలితం ఉంటుంది. అలాగే గర్భవతులకు దిష్టి తగలకుండా ఉండేందకు బయటికి వెళ్తున్నపుడు రెండు వేపాకులను వెంట తీసుకుని వెళ్లాలి. ఇంటికి తిరిగి రాగానే వాటిని కాల్చేయ్యాలి. ఇలా చేస్తే దిష్టి పోతుంది. ఈ విధంగా సింపుల్ పరిహారాలను పాటించడం వల్ల దిష్టి సమస్య నుంచి బయటపడవచ్చు.