Site icon HashtagU Telugu

Sunday: సమస్యల నుంచి తొందరగా బయటపడాలంటే ఆదివారం రోజు ఈ పరిహారాలు పాటించాల్సిందే!

Sunday

Sunday

మామూలుగా ప్రతి ఒక్కరికి జీవితంలో కష్టాలు రావడం అనేది సహజం. కొందరికి కష్టాలు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతే మరికొందరికి మాత్రం దీర్ఘకాలం వేధిస్తూనే ఉంటాయి. ఇలా కష్టాలు వచ్చినప్పుడు చాలామంది చేయాల్సిన ప్రయత్నాలు చేసి దేవుడిని ఎక్కువగా నమ్ముకుంటూ ఉంటారు.. అందుకే బాధలు, కష్టాలలో ఉన్నప్పుడు చాలామంది పరిహారాలు పాటిస్తారు. దీని వల్ల మానసిక ఊరట లభించడంతో పాటూ.. కష్టాల నుండి మనసు పాజిటివ్ వైపు మళ్లుతుందట. అయితే మీరు కూడా అలా కష్టాలతో సతమతమవుతుంటే ఆదివారం రోజు ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే ఈజీగా సమస్యల నుంచి బయటపడవచ్చట.

ఆదివారం సూర్య భగవానుడికి చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు సూర్య భగవానుడిని ఆరాధిస్తారు. సూర్య భగవానుడికి కొన్ని పరిహారాలు పాటిస్తే కష్టాల నుండి గట్టెక్కవచ్చట. ఆదివారం ఉదయం స్నానం చేసి తూర్పు వైపు తిరిగి నీటిని అర్ఘ్యం సమర్పించాలట. మామూలుగా ఇంటి దగ్గరైనా ఇలా చేయవచ్చు లేదంటే నదీ ప్రాంతంలో సముద్రంలో నీరు పారె ప్రాంతంలో ఇలా చేయవచ్చు అని చెబుతున్నారు. అయితే ఆర్ఘ్యం సమర్పించేటప్పుడు “ఓం సూర్యాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ఆదిత్యాయ నమః” అనే మంత్రాలు జపించాలట.

అంతేకాకుండా ఆదివారం రోజున పేదవారికి బెల్లం,ఎరుపు రంగు వస్త్రాలు,పాలు, రాగి పాత్రలు దానం చేయాలని ఇలా చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి అని చెబుతున్నారు. అలాగే ఆదివారం రోజు ఇంటి ప్రధాన ద్వారం వద్ద నెయ్యి దీపం వెలిగిస్తే అంత మంచి జరుగుతుందట. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందట. చెడు శక్తులు తొలగిపోతాయని దుష్టశక్తులు కూడా ఇంట్లోకి ప్రవేశించవని చెబుతున్నారు. ఆదివారం రోజు పూజ చేసిన తర్వాత చందన తిలకాన్ని నుదుటిన ధరించాలని ఈ విధంగా చేస్తే పనిలో అడ్డంకులు ఏవైనా ఉంటే తొలగిపోతాయని చెబుతున్నారు. ఈ విధమైన పరిహారాలు పాటిస్తే కష్టాల నుంచి కట్టేక్కడం ఖాయం అని చెబుతున్నారు.