మన వంటింట్లో దొరికే మసాలా దినుసుల్లో లవంగం కూడా ఒకటి. ఈ లవంగం ఎన్నో రకాల కూరల్లో ఉపయోగిస్తూ ఉంటారు. దీని వాసన కాస్త ఘాటుగా తింటే కొంచెం కారంగా ఉంటుంది. అయితే లవంగం కేవలం ఆహార పదార్థాలలో మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఉపయోగించుకోవడం వల్ల ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. మరి లవంగంతో ఎటువంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మాములుగా లవంగాలను పూజల్లోనూ, పితృదేవత ఆరాధనలోనూ వినియోగిస్తారు. లవంగాల్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని నమ్మకం. జ్యోతిషంలో కూడా లవంగాలకు సంబంధించిన అనేక పరిహారాల ప్రస్థావన ఉంది. చిన్న లవంగంతో చేసే పరిహారంతో పెద్ద సమస్యలను పరిష్కరించవచ్చని పండితులు చెబుతున్నారు.
మీరు ఎటువంటి పని చేసినా కూడా ఆటంకం కలుగుతోందా అలాంటి సందర్భాల్లో ఆంజనేయ స్వామిని పూజించి ఆవ నూనెతో దీపం వెలిగించి అందులో రెండు లవంగాలు వేసి హారతి ఇవ్వాలి. ఇలా చేస్తే త్వరలోనే మీరు అనుకున్న పనులు సాధిస్తారు. అలాగే ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్తున్నపుడు నోట్లో రెండు లవంగాలు వేసుకుని వెళ్లాలి. వెళ్లాల్సిన చోటుకు చేరిన తర్వాత నోట్లోని లవంగాల్లోని చిన్న ముక్కను అక్కడ విసిరేయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల మీరు వెళ్లిన పని విజయవంతంగా పూర్తవుతుంది. ఆర్థిక సమస్యలు వేధిస్తుంటే, అప్పుల బాధలు ఉంటే లక్ష్మీదేవికి ఎర్ర గులాబీతో పాటు రెండు లవంగాలు సమర్పించాలి. 5 లవంగాలను, 5 రూపాయి బిల్లలను ఎరుపు రంగు వస్త్రంలో కట్టి పూజలో ఉంచి ఆ మూటను డబ్బు దాచుకునే చోట పెట్టుకుంటే లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుందని శాస్త్రం చెబుతుంది.
అంతే కాదు ధనధాన్యాలకు లోటు ఉండదు. భక్తిగా నమ్మకంతో ఈ పరిహారం చేసుకుంటే తప్పక మంచి ఫలితాలు ఉంటాయి. కొంత మందికి జాతకంలో దోషం ఉండడం వల్ల పనులు కాకపోవడం, ఆర్థిక కష్టాలు, అపజయాలు వెంటాడుతుంటాయి. జాతకంలో రాహు-కేతు దోషం ఉంటే ప్రతి శనివారం లవంగాలు దానం చెయ్యాలి. అంతేకాదు శివలింగానికి లవంగాలు సమర్పించాలి. ఇలా చెయ్యడం వల్ల రాహు కేతువుల దుష్ప్రభావాల నుంచి విముక్తి దొరుకుతుంది. ఒక్కోసారి కుటుంబంలో ఎవరో ఒకరు అనారోగ్యం బారిన పడడం జరుగుతుంటుంది. లేదా ఎవరికైనా తీవ్రంగా దిష్టి తగిలి అకారణంగా అనార్యగ్యం పాలవుతుంటారు. ఇలాంటపుడు 5 లవంగాలు తీసుకుని వారి మీదుగా కింద నుంచి పైకి , పై నుంచి కిందకి వాటిని 7 సార్లు క్లాక్ వైజ్, 7 సార్లు యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసి కాల్చెయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల చెడు దృష్టి ప్రభావాన్ని తొలగించవచ్చు.