Lord Shiva: ప్రతి సోమవారం శివుడిని పూజిస్తే మీ జీవితం ఇక సుఖసంతోషాల హరివిల్లే

హిందూ మతంలో సోమవారం రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ రోజు పరమ శివుడికి (Lord Shiva) అంకితం చేయబడింది. ఈ రోజున శివుడికి భక్తితో పూజించడంతో పాటు ఉపవాసం ఉండే సంప్రదాయం ఉంది

  • Written By:
  • Publish Date - January 3, 2023 / 09:19 AM IST

హిందూ (Monday) మతంలో సోమవారం రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ రోజు పరమ శివుడికి (Lord Shiva) అంకితం చేయబడింది. ఈ రోజున శివుడికి భక్తితో పూజించడంతో పాటు ఉపవాసం ఉండే సంప్రదాయం ఉంది. భక్తులు పరమశివున్ని నిష్టతో పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని చెబుతారు.  పరమశివుని ఆశీస్సులతో భక్తులకు సుఖ సంతోషాలు లభిస్తాయి. దీనితో పాటు, సోమవారం కొన్ని ప్రత్యేక అంశాలను పాటించాలి. దీనివల్ల ఒక వ్యక్తి జీవితంలో వచ్చే ఆర్థిక సంక్షోభం తొలగిపోయి డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయని నమ్ముతారు.

ఇవీ నివారణలు..

మీరు జీవితంలో డబ్బుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే.. చాలా ప్రయత్నించినప్పటికీ డబ్బు ఆదా చేయలేకపోతే సోమవారం నాడు శివుడిని పూజించండి. రాత్రి శివలింగం ముందు నెయ్యి దీపం వెలిగించి, 41 రోజులు క్రమం తప్పకుండా పూజ చేయండి. ఇలా చేయడం వల్ల పరమశివుడు తన భక్తులకు విశేషమైన అనుగ్రహం ప్రసాదిస్తాడు.వారి ఆర్థిక సమస్యలు తొలగిపోయేలా చేస్తాడని నమ్మకం.

శివలింగానికి తేనెను సమర్పిస్తే..

శివున్ని ఆరాధించడం ద్వారా మనిషి సుఖ సంతోషాల వరం పొందుతాడు. మీరు కూడా మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు మరియు శాంతిని పొందాలంటే, శివుడిని క్రమం తప్పకుండా పూజించండి.సోమవారం నాడు శివలింగానికి తేనెను సమర్పిస్తే, శివుడు సంతోషిస్తాడు. వ్యక్తి జీవితంలో ఉద్యోగం , వ్యాపారానికి సంబంధించిన సమస్యలను తొలగిస్తాడు. ఈ పరిహారం చేయడం ద్వారా, జీవితంలో పురోగతికి కొత్త మార్గాలు తెరవబడతాయి.

జీవితంలో ఆటంకాలు ఉంటే..

ఎక్కువ కాలం ఏదైనా పని చేయడంలో ఆటంకాలు ఉంటే, సోమవారం నాడు భోలేనాథ్‌ని పూజించండి. పూజలో శివలింగాన్ని బేల్ పత్ర, ధాతుర, పాలు, నీటితో అభిషేకించాలని గుర్తుంచుకోండి.