Vastu Tips : పూజ గదిలో వీటిని నేలపై పెట్టకూడదు..ఎందుకంటే..!!

ప్రతిరోజూ మన ఇష్టదైవానికి పూజలు చేయడం చాలా మంచింది. ఎంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారో...మనకు అంత మంచిది జరుగుతుంది. దేవుడి చల్లని చూపు మనమీద ఉంటుంది.

  • Written By:
  • Publish Date - June 26, 2022 / 06:25 AM IST

ప్రతిరోజూ మన ఇష్టదైవానికి పూజలు చేయడం చాలా మంచింది. ఎంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారో…మనకు అంత మంచిది జరుగుతుంది. దేవుడి చల్లని చూపు మనమీద ఉంటుంది. సుఖసంతోషాలతో సిరిసంపదలతో వెలుగుతుందని తమకు ఇష్టమైన దైవాన్ని భక్తశ్రద్ధలతో కొలుస్తుంటారు. ఉదయం, సాయంత్రం స్నానమాచరించి దేవుడికి పూజలు చేస్తుంటారు. కానీ కొంతమందికి పూజల వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇంట్లో సమస్యలు అలాగే ఉంటాయి. దీనికి కారణం పూజ చేసేటప్పుడు తెలిసి, తెలియక చేసే కొన్ని పొరపాటులు ఉంటాయి. అందుకే దేవుని అనుగ్రహం వారిపై ఉండదు. అందుకే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి.

పూజచేసేటప్పుడు దేవుని విగ్రహాలన్నింటిని నేలపై అస్సలు ఉంచకూడదు. పూజగదిని శుభ్రం చేసేటప్పడు విగ్రహాలను కానీ ఫోటోలను కానీ ఒక పీఠమీద లేదంటే శుభ్రమైన గుడ్డమీద పెట్టాలి. నేలపై అస్సలు పెట్టకూడదు. ఇలా దేవుడి విగ్రహాలను నేలపై పెట్టడం వల్ల దేవుళ్లను అవమానించినట్లు అవుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇలా చేస్తే మీ ఇంట్లో దరిద్ర్యం తాండవం చేస్తుంది. ఏదైనా పీట మీద లేదా గుడ్డమీదో పెట్టాలి. ఆ తర్వాత ఎప్పటిలాగే పూజ చేయాలి.

దేవుడి గదిలోపల మాత్రమే దీపాన్ని వెలిగించాలి. నేలపై దీపాన్ని పెట్టి పూజలు చేయరాదు. ఎప్పుడైనా సరే దీపాన్ని ఒక ప్లేట్ లో కానీ స్టాండ్ లో కానీ పెట్టి వెలిగించాలి. దీపాన్ని నేలపై పెట్టి అస్సలు వెలిగించవద్దు. ఇలా చేస్తే ఇంటికి అరిష్టం కలుగుతుంది. అందుకే దీపం వెలిగించేముందు నేలపై వరిపిండితో ముగ్గు వేయాలి. దానిపై ఒక ప్లే ట్ లేదా స్టాండ్ పెట్టి అందులో దీపాన్ని వెలిగించాలి.

శంఖాన్ని ఎప్పుడూ దేవుని గదిలో ఉంచాలి. ఎందుకంటే శంఖం లక్ష్మీదేవికి ప్రతీకగా భావిస్తారు. దానిని నేలపై అస్సలు ఉంచకూడదు. అది లక్ష్మీదేవికి ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. శంఖాన్ని నేలపై ఉంచితే…ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. ఇంట్లోవారు మానసికంగా, శారీరకంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

బంగారం, వెండి, వజ్రాలు ఇలా విలువైన వాటిని నేలపై ఉంచకూడదు. ఇవి ఏదో ఒక గ్రహానికి సంబంధించినవి. వీటిని నేలపై ఉంచితే వాటిని అవమానించినట్లు అవుతుంది. పూజముగిసిన అనంతరం రత్నాలను నేలపై ఉంచితే వాటి ప్రభావం తగ్గుతుంది. కాబట్టి వాటిని ఒక గుడ్డలో చుట్టిపెట్టాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ వీటిని నేలపై ఉంచకూడదు. ఇంటికి శుభం కలగాలంటే ఈ నాలుగు వస్తువులను నేలపై ఉంచకూడదు. ఇవి పూజచేస్తున్నవాళ్లు తప్పక గుర్తు పెట్టుకోవాలి.