Site icon HashtagU Telugu

Spirtual: అపార ధన ప్రాప్తి కోసం ఎలాంటి విషయాలను పాటించాలో మీకు తెలుసా?

Spirtual

Spirtual

మామూలుగా మనం జీవితంలో చేసే కొన్ని కొన్ని రకాల తప్పులు మనం ఎదుర్కునే సమస్యలకు కూడా కారణం కావచ్చు. వాస్తు ప్రకారంగా లేదంటే మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా మనం జీవితంలో ఆర్థికంగా ఎదుర్కునే సమస్యలు మానసికంగా ఎదుర్కొనే సమస్యలకు కారణం కావచ్చు అని చెబుతున్నారు పండితులు. చాలామంది ఇవి పాటించకపోయినా వీటిని కొట్టి పడేసిన ఇదే నిజం అంటున్నారు పండితులు. ఇంకా చెప్పాలంటే మనం ఎదుర్కొనే ఆర్థిక సమస్యలకు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా కారణం కావచ్చు అని చెబుతున్నారు.

ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు చెప్పబోయే విషయాలను పాటిస్తే అపార ధన ప్రాప్తి కలుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ఇంతకీ ఎలాంటి విషయాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సంధ్యా సమయంలో ఎప్పుడూ కూడా తలుపు వేసి అసలు ఉంచకూడదు. ఎల్లప్పుడూ సాయంత్రం సమయంలో ప్రధాన ముఖద్వారాన్ని తెరిచి ఉంచాలని దానివల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని చెబుతున్నారు. అదేవిధంగా ప్రతిరోజు పూజ చేసే వారు తప్పనిసరిగా శ్రీ సూక్తం పఠించాలని చెబుతున్నారు.

సిరి సంపదల కోసం అమ్మవారిని పూజించేవారు అమ్మవారిని పూజించడంతో పాటు ఒక లవంగాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలట. మీ ఇంట్లో పగిలిపోయిన విరిగిపోయిన వస్తువులు ఏమైనా ఉంటే వాటిని శనివారం రోజు బయటపడేయడం మంచిది అని చెబుతున్నారు. ఒకవేళ మీరు ఇల్లు క్లీన్ చేయాలి అనుకుంటే అనగా బూజు దులపడం వంటివి చేయాలి అనుకుంటే శనివారం చేయడం మంచిదని చెబుతున్నారు. అలాగే పూజ గదిలో ఏకాక్షి కొబ్బరికాయను ఉంచడం వల్ల ధనప్రాప్తి కలుగుతుందని చెబుతున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఉదయం నిద్ర లేచిన తర్వాత మొదట అరచేతులను చూసుకుని తర్వాత వాటిని కళ్ళకు అద్దుకుంటే లక్ష్మి అనుగ్రహం తప్పక కలుగుతుందని చెబుతున్నారు. పైన చెప్పిన విషయాలు తప్పకుండా పాటించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలిగి ఆకస్మిక, అపార ధన ప్రాప్తి కలుగుతుందని చెబుతున్నారు.