Site icon HashtagU Telugu

Saturday: అనుకున్న పనులు జరగాలి అంటే శనివారం రోజు ఈ పనులు చేయాల్సిందే!

Saturday

Saturday

శనీశ్వరుడిని… న్యాయదేవుడు లేదా కర్మధాత అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే మనం చేసే మంచి చెడులను బట్టి శుభాశుభ ఫలితాలను అందిస్తూ ఉంటాడు శనీశ్వరుడు. కర్మలకు అనుగుణంగానే ఫలాలను అందిస్తూ ఉంటాడు. ఇక పోతే వారంలో శనివారం రోజు శనీశ్వరుడికి అంకితం చేయబడింది. ఈరోజున స్వామి వారిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల తప్పకుండా ఆయన అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే జీవితంలో ఉన్న బాధలు కష్టాల నుంచి విముక్తి పొందాలంటే శనివారం రోజు తప్పకుండా కొన్ని పనులను చేయాలనీ చెబుతున్నారు.

శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే శనివారం రోజు కుక్కకు అంటే నల్ల కుక్కకు సేవ చేయాలట. అంటే నల్ల కుక్కను ఆహారం పెట్టడం మంచిదని చెబుతున్నారు. ఈ పరిహారాన్ని చేయడం ద్వారా శనీశ్వరుడు సంతోషంగా ఉంటాడట. ఇలా చేస్తే ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తుందట. శనిదేవుడిని కర్మ ప్రదాత అని కూడా అంటారు. శనిదేవుడి అనుగ్రహం పొందడానికి శనివారం రోజున శుభకార్యాలను చేయాలని చెబుతున్నారు. ఇందుకోసం మీరు పేదలకు, నిస్సహాయులకు సేవ చేయవచ్చట. వీరికి ఆహారం ఇవ్వవచ్చు. అలాగే వారి మెరుగైన ఆరోగ్యం కోసం మీరు మందులు కూడా ఏర్పాటు చేయవచ్చు.

ఈ విధంగా మీరు మంచి పనులు చేయడం వల్ల శని దేవుని అనుగ్రహాం తప్పకుండా కలుగుతుందని చెబుతున్నారు. అలాగే శనివారం రోజు రావి చెట్టుకు నల్ల నువ్వులు కలిపిన నీటిని సమర్పించడం వల్ల, నెయ్యి దీపాలు వెలిగించడం వల్ల సుఖసంతోషాలు శ్రేయస్సు ఆదాయం పెరుగుతాయని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా శనివారం రోజు ఆంజనేయ స్వామిని కూడా పూజించడం వల్ల శని దేవుడికి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే తొలగిపోతాయట. శనివారం రోజు హనుమాన్ చాలీసాను పారాయణం చేయాలి.