Astrology: నవగ్రహ దోష నివారణ అవ్వాలంటే ఈ మొక్కలు నాటి పూజించాల్సిందే?

మామూలుగా గ్రహాలు మనుషుల జీవితాల పై ప్రభావాన్ని చూపిస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా గ్రహాల గమనం వల్ల వివిధ రాశుల వారి జీవి

  • Written By:
  • Publish Date - January 28, 2024 / 05:00 PM IST

మామూలుగా గ్రహాలు మనుషుల జీవితాల పై ప్రభావాన్ని చూపిస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా గ్రహాల గమనం వల్ల వివిధ రాశుల వారి జీవితాలలో ఊహించని మార్పులు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు గ్రహాలు ఆయా రాశుల నీచ స్థానాలలో ఉన్నప్పుడు ప్రతికూల ఫలితాలు తప్పకుండా పొందాల్సి ఉంటుంది. గ్రహాలు రాశులలో మంచి స్థానంలో ఉంటేనే అనుకూల ఫలితాలు వస్తాయి. గ్రహాలు నీచ స్థానంలో ఉంటే ఆ సమయంలో గ్రహ శాంతి కోసం కొన్ని పరిహారాలను తప్పకుండా పాటించాలి ఉంటుంది. మరి నవగ్రహాలకు శాంతి కలగజేయడానికి ఏ మొక్కలను నాటాలి? వేటిని పూజించాలి? అన్న విషయానికి వస్తే..

కేతు గ్రహానికి సంబంధించి దర్భ మొక్కలను నాటడం, పూజించడం మంచిది. అలాగే రాహు గ్రహానికి సంబంధించి గరిక మొక్కలను నాటడం మంచిది. అలాగే ఆ గరికను తప్పకుండా పూజించాలి. అందుకే గ్రహణాల సమయంలో గరికనే ఉపయోగిస్తాము. శని గ్రహానికి సంబంధించి జమ్మి మొక్కలను నాటడం పూజించడం మంచిది. శుక్ర గ్రహానికి సంబంధించి మేడి మొక్కలను నాటడం పూజించడం మంచిది. గురు గ్రహానికి సంబంధించి రావి మొక్కలను నాటడం పూజించడం మంచిది. ఇక బుధ గ్రహానికి సంబంధించి ఉత్తరేణి మొక్కలను నాటి పూజించడం వల్ల బుధుడి వల్ల కలిగే అశుభ ఫలితాలు రాకుండా ఉంటాయి.

కుజ గ్రహానికి సంబంధించి సండ్ర మొక్కలను నాటి పూజించడం మంచిది. చంద్రగ్రహానికి సంబంధించి మోదుగ మొక్కలను నాటి పూజించడం వల్ల చంద్రుడు శాంతిస్తాడట. . రవి గ్రహానికి సంబంధించి తెల్ల జిల్లేడు మొక్కలను నాటి పూజించడం వల్ల రవి మనపై ఉంటుంది. కనుక నవగ్రహాల శాంతి కోసం పైన సూచించిన మొక్కలను నాటి పూజిస్తే మెరుగైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి గ్రహాల స్థానం మీ జీవితంలో ఇబ్బంది పెడుతుంటే కచ్చితంగా ఈ మొక్కలను నాటి పూజించాలి.