Site icon HashtagU Telugu

Plants: మీ ఇంట్లో పెంచుకునే ఈ మొక్కలు నెగిటివ్ ఎనర్జీని పెంచుతాయని మీకు తెలుసా?

Mixcollage 24 Jan 2024 06 36 Pm 7581

Mixcollage 24 Jan 2024 06 36 Pm 7581

మాములుగా చాలామంది ఇంట్లో అనేక రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. ఇంట్లో పచ్చని మొక్కలు ఉంటే ఆ అందం, అనందం వేరు. అందుకే చాలామంది ఇంటిని రకరకాల మొక్కలతో నింపేస్తూ ఉంటారు. అయితే మొక్కలు ఇంట్లో పెంచుకోవడం మంచిది కానీ, అందులో కొన్ని రకాల మొక్కలు నెగిటివ్ ఎనర్జీని పెంచుతాయట. అందుకే పొరపాటున కూడా అలాంటి మొక్కలను ఇంట్లో పెంచుకోవద్దు అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

క్యాక్టస్.. వీటినే ఎడారి మొక్కలు అని కూడా అంటారు. వీటిని పెంచడానికి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. చూడటానికి కూడా అందంగా ఉంటాయి. వీటిని చాలామంది ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. కానీ వాస్తు ప్రకారం వీటిని ఇంట్లో పెంచకపోవడమే మంచిది. వాటికి ఉండే ముళ్లు నెగిటివ్ ఎనర్జీని వ్యాపింప చేస్తాయి. మన ఇంట్లోని ఎనర్జీని కూడా తగ్గిపోయేలా చేయగలవు. అందుకే. ఈ మొక్కలను ఇంట్లో పెంచకపోవడమే మంచిది.

బోన్ సాయి..చాలా మంది ఈ బోన్ సాయి మొక్కలను ఎక్కువగా పెంచుతూ ఉంటారు. అయితే నిజానికి వాస్తు ప్రకారం ఈ మొక్కలను ఇంట్లో పెంచడం అస్సలు మంచిది కాదట. ఇవి మీ ఎదుగుదలను ఆపేస్తాయట. ప్రకృతి విరుద్దంగా వాటిని పెంచడం కూడా నెగిటివ్ ఎనర్జీ కి కారణమౌతాయట.

లక్కీ బాంబూ… లక్కీ బాంబూ చెట్టు ఏ ఇంటిలో అయితే ఉంటుందో ఆ ఇంటిలో ఉన్న వారికి అదృష్టం వరిస్తుంది. ఈ మొక్కలు భారీ వెదురు చెట్టు జాతికి సంబంధించినవే. కాకపోతే ఇవి చిన్న వెదురు చెట్లు. ఈ చెట్లను మనము ఆఫీసులో ఇంటిలో టేబుల్ పైన ఉంచిన ఇంటికి ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఈ చెట్టు ఉన్న ఇంటికి అదృష్టం పట్టుకుందని చాలామంది నమ్ముతారు. అయితే. ఈ బాంబో ప్లాంట్ ని వాస్తు ప్రకారం ఇంటి మొదట్లో పెడితే మనకు అదృష్టం కలిసొస్తుందట. కానీ పొరపాటున కూడా వీటిని ఇంటి వెనక పెట్టకూడదట. అలా పెట్టడం వల్లమనకు దక్కాల్సిన సపోర్ట్ వ్యక్తిగత జీవితంలో దక్కకుండా పోతుందట.

కాటన్ ప్లాంట్స్.. సాధారణంగా రైతులు పొలాల్లో కాటన్ పండిస్తారు. అది చాలా కామన్ కానీ, వీటిని ఇంట్లో మాత్రం పెంచుకోకూడదట. దాని వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుందట.