Vastu Tips: మీ ఇంట్లో కూడా ఇలాంటి మొక్కలు ఉన్నాయా.. అయితే దరిద్రం పట్టినట్లే?

మామూలుగా చాలామంది ఇంట్లో, ఆఫీస్ లలో వాస్తు ప్రకారంగా ఎన్నో రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. ఇంటిని అందంగా అలంకరించడం కోసం రకరకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. అయితే మొక్కలను పెంచుకోవడం మంచిదే కానీ వాస్తు ప్రకారం గా కొన్ని రకాల మొక్కలను ఇంట్లో అస్సలు పెంచుకోకూడదట. ముఖ్యంగా ఇంట్లో కొన్ని రకాల వస్తువులు పెంచుకోవడం వల్ల ఆర్థిక నష్టం కలగవచ్చు అంటున్నా

  • Written By:
  • Updated On - July 5, 2024 / 06:15 PM IST

మామూలుగా చాలామంది ఇంట్లో, ఆఫీస్ లలో వాస్తు ప్రకారంగా ఎన్నో రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. ఇంటిని అందంగా అలంకరించడం కోసం రకరకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. అయితే మొక్కలను పెంచుకోవడం మంచిదే కానీ వాస్తు ప్రకారం గా కొన్ని రకాల మొక్కలను ఇంట్లో అస్సలు పెంచుకోకూడదట. ముఖ్యంగా ఇంట్లో కొన్ని రకాల వస్తువులు పెంచుకోవడం వల్ల ఆర్థిక నష్టం కలగవచ్చు అంటున్నారు పండితులు. అంతేకాకుండా కొన్ని రకాల మొక్కలు ఇంట్లో ఉంటే దరిద్రం పట్టినట్లే అంటున్నారు. మరి ఇంట్లో ఎలాంటి మొక్కలు ఉండకూడదో, ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇంట్లో పెట్టుకునే కొన్ని మొక్కలు జీవితంలో ఎంతో భారాన్ని తెచ్చి పెడతాయి. అంతేకాకుండా ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచేందుకు కూడా అవి కీలక పాత్ర పోషిస్తాయి. చూడడానికి ఆ మొక్కలు ఎంతో అందంగా ఉన్నప్పటికీ అనేక రకాల అనారోగ్య సమస్యలను తెచ్చి పెట్టే అవకాశాలు ఉంటాయనీ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే వాస్తు శాస్త్ర ప్రకారం గా ఇంట్లో ఉండకూడని మొక్కల్లో చింత చెట్టు కూడా ఒకటి. చాలామంది ఇళ్లలో చింత మొక్కను పెంచుతూ ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చింతమొక్క ఉండడం వల్ల అనేక దుష్ప్రభావాలకు దారితీస్తుందట. ఇందులో ఉండే ప్రతికూల శక్తి అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందట.

అలాగే మానసిక ప్రశాంతతను కూడా నాశనం చేయవచ్చని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో లేదంటే ఆఫీసులో ఎక్కువగా పెంచుకునే మొక్కల్లో బోన్సాయ్ మొక్క కూడా ఒకటి. కొంచెం లగ్జరీగా ఉన్నవారు మాత్రమే ఇలాంటి మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. ఇది చూడడానికి ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కానీ ఈ బోన్సాయ్ చెట్టును ఇంట్లో పెంచడం వల్ల అనేక సమస్యలు రావచ్చు. ముఖ్యంగా వ్యాపార సంస్థల్లో ఈ మొక్కలను ఉంచడం వల్ల అనేక సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీంతో పాటు ఆర్థికంగా కూడా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట.

ఈ మొక్క అందంగా ఉన్నప్పటికీ ఈ మొక్కను ఎట్టి పరిస్థితులలో వ్యాపార స్థలాలు అలాగే ఇంట్లో పెంచుకోకూడదు అంటున్నారు. అలాగే చాలామంది డెకరేషన్ కోసం కాక్టస్ మొక్కలను ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. ఈ మొక్క ఇంట్లో ప్రతికూలతను స్ప్రెడ్ చేయడంతో పాటు అనేక రకాల సమస్యలకు దారితీస్తుంది. ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటే లేనిపోని సమస్యలను కొని తెచ్చుకున్నట్టే అవుతుంది అంటున్నారు పండితులు. అలాగే ఎప్పుడూ కూడా ప్రతి మొక్కను ఇంట్లో పెంచుకోకూడదు. ఈ మొక్క ఇంట్లో ప్రతీ కూల శక్తులను పెంచుతుంది.