మామూలుగా ప్రతి ఒక్కరూ అదృష్టం పట్టిపీడించాలి అదృష్టం కలగాలి ఐశ్వర్యవంతులు అవ్వాలి అని కోరుకోవడం తోపాటు ఎన్నో రకాల కలలు కూడా కంటూ ఉంటారు. కానీ ఇలా అదృష్టం పట్టడం దశతిరగడం రాజయోగం పట్టడం ఇలాంటివన్నీ కూడా కొద్దిమంది లైఫ్ లోనే జరుగుతూ ఉంటాయి. అందుకే సమయం సందర్భం బట్టి ఏదైనా కలిసి రావాలంటే అదృష్టం ఉండాలి అని అంటూ ఉంటారు. అయితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఇంట్లో కొన్ని రకాల వస్తువులను అలంకరణగా ఏర్పాటు చేసుకోవడం వల్ల అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. మరి ఇంట్లో ఎలాంటి వస్తువులను పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరి ఇంట్లో పిల్లన గ్రోవి ఉంటే చాలా మంచిదట. రెండు పిల్లన గ్రోవిలను ఇంట్లో గోడకు 45 డిగ్రీల కోణంలో ఉండేలా వేలాడదీయడం వల్ల అదృష్టం బాగా కలిసి వస్తుందని చెబుతున్నారు. అలాగే ఇంటిపై భాగంలో జెండాను ఏర్పాటు చేసుకోవడం వల్ల కూడా ఉత్తమ ఫలితాలు కనిపిస్తాయట. తెలుపు ఆకుపచ్చ కాషాయం వంటి మూడు రంగులలో ఏదైనా ఒక రంగు త్రిభుజాకారం క్లాత్ ని ఇంటిపై వేలాడదీయాలని ఇలా చేస్తే అదృష్టం కలిసి రావచ్చు అని చెబుతున్నారు. నెమలి పించం ఇంట్లో ఉన్నారు కూడా చాలా శుభకరం అంటున్నారు. ఇంటి ప్రధాన గుమ్మం పై రెండు నెమలిపించాలని వి(v) ఆకారంలో పసుపు దారంతో కడితే అదృష్ట లక్ష్మి తలుపు తడుతుందని చెబుతున్నారు. అదేవిధంగా ఇంటిముందు భాగంలో జండా సింహాలు ఎద్దుల కొమ్ములు ఉంటే చాలా మంచిదట. ఇంటికి మెయిన్ ఎంట్రెన్స్ లో రెండు వైపులా రెండు ఎద్దు బొమ్మలు ఏర్పాటు చేసుకుంటే భోగభాగ్యాలు సిరిసంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
లేదంటే సింహాల బొమ్మలు గుమ్మానికి రెండు వైపులా ఉన్నా కూడా రాజ వైభోగం సిద్ధిస్తుందట. అదేవిధంగా రామ టెంకాయ లేదా లగు కొబ్బరికాయ ఇంట్లో ఉన్నా కూడా శుభ ఫలితాలు కలుగుతాయట. మార్కెట్లో ఇవి కుంకుడుకాయ పరిమాణం నుంచి ఉసిరికాయ పరిమాణం వరకు లభిస్తూ ఉంటాయి. పూజా మందిరంలో ఒక చిన్న బౌల్లో సింధూరం పోసి అందులో రామ టెంకాయ ఉంచితే చాలా మంచిదని చెబుతున్నారు. మీరు నడిపే వాహనానికి గవ్వలు జీడిగింజలు కలిపి కట్టినా కూడా మంచి ఫలితాలు కలుగుతాయట. ఐదు జీడిగింజలు ఆరు గవ్వలను ఒకదాని తర్వాత ఒకటి గుచ్చి దానిని బండికి కట్టాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల కూడా అదృష్ట యోగం పడుతుందని వాహనాలు కూడా సురక్షితంగా ఉంటాయని చెబుతున్నారు.