Pitru Paksha 2022:చనిపోయే టైంలో దగ్గర్లో 4 వస్తువులు ఉంటే నేరుగా స్వర్గ లోకమే!!

గణేష్ ఉత్సవాలు ముగిసిన వెంటనే పితృ పక్షం ప్రారంభమవుతుంది. ఇది ఈ సంవత్సరం సెప్టెంబరు 10 నుండి ప్రారంభమై...

  • Written By:
  • Publish Date - September 17, 2022 / 06:30 AM IST

గణేష్ ఉత్సవాలు ముగిసిన వెంటనే పితృ పక్షం ప్రారంభమవుతుంది. ఇది ఈ సంవత్సరం సెప్టెంబరు 10 నుండి ప్రారంభమై… సెప్టెంబరు 25న సర్వపితృ అమావాస్యతో ముగుస్తుంది. ఈ 15 రోజులు చనిపోయిన పూర్వీకులకు తర్పణం, శ్రాద్ధం, పిండ ప్రధానం చేస్తారు.ఇక పితృ పక్ష సమయంలో పూర్వీకులు భూలోకానికి వస్తారని నమ్ముతారు. అంతేకాకుండా వారి ఆత్మకు శాంతి కలగాలని శ్రాద్ధం చేయడం ద్వారా పూర్వీకులు సంతోషించి వారి వారి కుటుంబాలను ఆశీర్వదిస్తారు. అయితే చనిపోయే టైం లో మనిషి దగ్గర నాలుగు వస్తువులు ఉంటే .. చనిపోయాక అతడికి శ్రాద్ధ కర్మలు చేయాల్సిన అవసరమే ఉండదు. ఇంతకీ ఆ వస్తువులు ఏమిటో తెలుసుకుందాం..

* తులసి

చనిపోయే టైంలో వ్యక్తి పక్కన తులసి మొక్క ఉంటే చాలా మంచిది. అతడి నుదుటిపై, నోటిపై
తులసి ఆకులు ఉంచాలి. చనిపోయే టైంలో వ్యక్తి నోటిలో తులసి తీర్థం పోయాలి. వీటిలో కొన్ని అంశాలు చనిపోయే టైంలో జరిగినా.. నేరుగా చనిపోయాక స్వర్గానికి వెళ్ళిపోతారు. అందుకే ప్రతి ఇంట్లో తులసి కోట ఉండాలని చెబుతారు.

* గంగా జలం

చనిపోయే టైంలో నోటిలో గంగా జలం పోస్తే స్వర్గం ప్రాప్తిస్తుందని గరుడ పురాణం చెబుతోంది. విష్ణుమూర్తి పాదాల నుంచి వచ్చిన గంగా జలానికి ఎంతో శక్తి ఉంటుంది. దాన్ని తాగిన వాళ్ళు విష్ణుమూర్తి వైకుంఠం లో చోటు దక్కించుకుంటారు. అందుకే చనిపోయిన వారి అస్థిలను కూడా గంగా జలంలో నిమజ్జనం చేస్తారు. ఎప్పటివరకైతే ఈ అస్థిలు గంగా జలంలో ఉంటాయో అప్పటివరకు చనిపోయిన వ్యక్తి స్వర్గ సుఖాలు అనుభవిస్తాడు.

* నువ్వులు

విష్ణుమూర్తి చెమట నుంచి నువ్వులు పుట్టాయని అంటారు.చనిపోయే టైంలో వ్యక్తి చేతితో నువ్వులు దానం చేయించాలి. నువ్వుల దానాన్ని గొప్ప దానంగా చెబుతారు. అతడి తల దిండు కింద నల్ల నువ్వులు ఉంచాలి. శ్రాద్ధ కర్మల్లో నువ్వులకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది.

* కుష్ గడ్డి

కుష్ అనేది ఒక రకమైన గడ్డి. అది ఎంతో మహిమాన్వితం అయింది. ఈ గడ్డి విష్ణుమూర్తి రోమాల నుంచి ఉత్పన్నం అయిందని నమ్ముతారు. చనిపోయే వ్యక్తి బెడ్ షీట్ పై కుష్ గడ్డిని పరచాలి. అతడి నుదుటి పై తులసి ఆకు ఉంచాలి. ఇవన్నీ జరిగాక చనిపోయే వ్యక్తి శ్రాద్ధ కర్మల అవసరం లేకుండానే స్వర్గానికి వెళ్తాడు.

పిండదానం ఎందుకు చేస్తారు?

గరుడ పురాణం ప్రకారం.. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని ఆత్మ 13 రోజుల పాటు అతని కుటుంబంతోనే ఉంటుంది. చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ 10 రోజులలో తిరిగి శరీరంలోకి ప్రవేశించాలని కోరుకుంటుంది. ఈ సమయంలో చనిపోయిన పూర్వీకులు ఆకలి దప్పికలతో బాధపడతారు. ఈ పది రోజులపాటు పిండ దానాన్ని చేయడం ద్వారా వారి ఆత్మ సంతృప్తి చెందుతుంది. చనిపోయిన వ్యక్తికి కుటుంబ సభ్యులు పిండ ప్రదానం చేయకపోతే ఆ వ్యక్తి ఆత్మ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. 13వ రోజున యమదూతులు ఆత్మను పట్టుకుని యమపురికి తీసుకెళతారు. 13వ రోజున బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం వల్ల కూడా పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది. యముడు ఆత్మ యొక్క పనుల ఆధారంగా న్యాయం చేస్తాడు.