Site icon HashtagU Telugu

Goddesses Laxmi: మీకు ఈ సంకేతాలు కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉన్నట్టే..?

Lakshmi Devi

Lakshmi Devi

చాలామంది ఎంత ఎంత సంపాదించినా ఇంట్లో ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉన్నప్పుడు మనకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయో అని బాధపడుతూ ఉంటారు. అలాగే ఆర్థిక సమస్యలు ఉంటే ఆ సమస్యల నుంచి గట్టెక్కించమని లక్ష్మీదేవిని కోరుకుంటు ఉంటారు. లక్ష్మీదేవిని ఇంటికి రమ్మని ఆహ్వానిస్తూ ఉంటారు. అయితే మన సమస్యల నుంచి గట్టెక్కి ఒక్కొక్కటిగా తీరుతున్న సమయంలో లక్ష్మీదేవిని ఇంటికి రావాలి. సమస్యల నుంచి గట్టెక్కించాలి అని కోరుకుంటూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంది అని తెలుసుకోవడానికి కొన్ని రకాల సంకేతాలు ఉన్నాయట. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉదయం సమయంలో నిద్ర లేవగానే పక్షులు కిలకిలా రావాలి వినిపిస్తూ ఉంటాయి.

అందులో కోయిల కూత వినడానికి ఎంతో వినసొంపుగా ఉంటుంది. అయితే కోయిల కూసే దిశగా ఆధారంగా కూడా శుభాశుభ పరిణామాలు జరుగుతాయట. ఒకవేళ కోయిల కూత ఉదయం పూట ఆగ్నేయ దిశ నుంచి వినిపించినట్లయితే నష్టం జరుగుతుందని,సాయంత్రం వినిపిస్తే అవి శుభసూచకంగా,మధ్యాహ్నం వినిపిస్తే అది శుభంగా భావిస్తారు.ఒకవేళ మామిడి చెట్టు మీద కూర్చోని కోయిల కూస్తుంటే లక్ష్మీ దేవి రాబోతోంది అని అర్థం. అలాగే చాలామంది బల్లి ని చూస్తే చాలు పరుగులు తీస్తూ ఉంటారు. బల్లి మీద పడితే ఆ శుభంగా భావిస్తూ ఉంటారు. ఒకవేళ బల్లి కుడి చేతి పై పడి త్వర త్వరగా ఎక్కడానికి ప్రయత్నిస్తే ఈ సంకేతం మీ పురోగతికి మార్గం తెరవబోతోంది అని అర్థం.

అంతేకాకుండా మీరు ఏదో ఒక రూపంలో డబ్బులు పొందబోతున్నారు అని అర్థం. అలాగే ఇంట్లో నల్ల చీమలు ఉంటే మాత్రం శుభ సూచకం అని చెప్పవచ్చు. నోటిలో బియ్యం ధాన్యాలు మోస్తున్న నల్ల చీమను శుభ చిహ్నంగా పరిగణిస్తారు. అక్షితలు మహాలక్ష్మీకి ఎంతో ప్రియమైనవి. అందుకే ఇవి సంపదతో ముడిపడి ఉంది. కానీ ఇంట్లో ఎర్ర చీమలు కనిపించకూడదు.

Exit mobile version