Site icon HashtagU Telugu

Vastu Tips: తలుపు వెనకాల వస్తువులు,దుస్తులు పెడుతున్నారా.. అయితే ఇది మీకోసమే!

Vastu Tips

Vastu Tips

మామూలుగా మనం చాలా రకాల విషయాలలో వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఇంటి విషయంలో స్థలం కొనుగోలు చేసే విషయం నుంచి ఇంట్లోనే వస్తువుల అమరికా వరకు చాలా విషయాలలో వాస్తు చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇంట్లో కొన్ని రకాల వస్తువులు ఎలా పడితే అలా పెడితే వాస్తు దోషాలను ఎదుర్కోక తప్పదు అంటున్నారు. అందుకే ఇంట్లో పెట్టే వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమాలను పాటించాలని చెబుతున్నారు. పక్కా వాస్తు నియమాలు పాటించకపోయినా, ఇంట్లో చేసే కొన్ని చిన్న పనుల వల్ల వాస్తు దోషాలు అనేవి ఏర్పడతాయట.

వీటి వల్ల ఇంట్లో చికాకులు, గొడవులు, దంపతుల మధ్య సఖ్యత లేకపోవడం, ఆర్థిక సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అయితే చాలా మంది ఇంటి మెయిన్ డోర్స్ లేదంటే బెడ్ రూమ్ డోర్స్‌ కి వాల్ హ్యాంగింగ్స్ ఏర్పాటు చేస్తారు. ఇలా చేయడం వల్ల మెస్సీగా కనిపించదు అనుకుంటారు. కానీ ఇలా పెట్టడం చాలా తప్పని వాస్తు శాస్త్రం చెబుతుంది. అదే విధంగా కొన్ని రకాల వస్తువులను కూడా తగిలిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల పురోగతి అనేది కుంటు పడుతుందట. వాస్తు ప్రకారం ఇంటి ద్వారం లక్ష్మీ దేవికి స్థానంగా చెబుతూ ఉంటారు.

ఇలా డోర్‌ వెనుక భాగంలో హ్యాంగర్లు ఏర్పాటు చేయకూడదట. అంతే కాకుండా ఖాళీగా ఉందని డోర్ల మీద కూడా టవల్స్, బట్టలు ఆరేస్తూ ఉంటారు. ఇలా కూడా చేయకూడదట. ఇలాంటి చిన్న తప్పుల వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు, చికాకులు కూడా ఏర్పడతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఇలా హ్యాంగర్లు ఏర్పాటు చేసుకోవాలి అనుకున్న వారు తలుపు వెనకాల కాకుండా వాస్తు ప్రకారంగా ఇంట్లోనే ఇతర ప్రదేశాలలో ఏర్పాటు చేసుకోవడం మంచిదని చెబుతున్నారు.