Site icon HashtagU Telugu

Sri Rama Navami: శ్రీరామనవమి రోజు పొరపాటున కూడా చేయకూడని పనులు ఇవే?

Article Recovered Recovered

Article Recovered Recovered

Sri Rama Navami: ప్రతి ఏటా చైత్ర మాసంలో దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. పుష్య నక్షత్రంలో చైత్రమాసం శుక్లపక్షం తొమ్మిదో రోజున శ్రీరాముడు జన్మించారు. ఇక ఈ పండుగని హిందువులు నియమనిష్టతో జరుపుకుంటారు. ఇక ఈ రోజున శ్రీరాముల వారి కళ్యాణం కూడా జరుగుతుంది.

ఆ రోజంతా ప్రతి గ్రామాలలో ప్రతి రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం ను జరిపిస్తారు గ్రామ పెద్దలు. ఇక వీరి వివాహానికి ఊరి జనాలంతా అతిధులుగా వచ్చి సంబరాలు జరుపుకుంటారు. ఆరోజు రాత్రి శ్రీరాములవారిని, సీతమ్మ తల్లిని పల్లకిలో ఊరంతా ఊరేగిస్తారు. ఇక శ్రీరామనవమి రోజు చాలామంది ఉపవాసం కూడా చేస్తారు.

దానివల్ల చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా అయోధ్యలో సరయు నదిలో పుణ్యస్నానాలు కూడా చేయటం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయి. ఇతర నదులలో కూడా స్నానం చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇక రామ చరిత, శ్రీరామరక్ష స్తోత్రాన్ని పటించటం, రామకీర్తనలు, భజనలు చేయటం వల్ల పుణ్యం కలుగుతుంది.

చాలావరకు శ్రీరామనవమి రాత్రి నిద్రపోకుండా జాగారం చేస్తూ భజనం చేయటం వల్ల మంచి జరుగుతుంది. పెళ్లి కానీ వాళ్లకు శ్రీరామనవమి ఘడియలు కలిసొస్తాయని.. దీనివల్ల వారికి వెంటనే పెళ్లిళ్లు జరుగుతాయని కొన్ని పురాణాలు కూడా చెబుతున్నాయి. ఇక ఈ పవిత్రమైన రోజున ఎవరిని ఎవరు మోసం చేయకుండా చిత్తశుద్ధితో ఉండాలి.

ఇక ఈరోజు పొరపాటున కూడా కొన్ని పనులు అస్సలు చేయకూడదు. లేదంటే పాపాలు వెంటాడుతాయి. ఆరోజు ముఖ్యంగా మాంసాహారం ను, మద్యం ను తీసుకోకూడదు. వండే కూరలలో ఉల్లిపాయలు, వెల్లుల్లి అస్సలు వేయకూడదు. జుట్టు కత్తిరించడం, షేవింగ్ చేయటం వంటివి కూడా మంచిది కాదు. ఆరోజు ఇతరులను విమర్శించకుండా ఏదైనా ప్రశాంతంగా చెప్పేలా చూసుకోవాలి. ఇతరులకు ద్రోహం అసలు చేయకూడదు.