చాణక్యనీతిలో స్త్రీ అభ్యున్నతి గురించి ఆచార్య చాణక్యుడు ఎన్నో విషయాలను పంచుకున్నాడు. వీటన్నింటిని సరైన సమయంలో సరైన మార్గంలో అమలు చేసినట్లయితే…స్త్రీలు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. స్త్రీ శక్తిని గ్రంథాలలో శక్తిరూపిణిగా పరిగణిస్తారు. అయితే చాణక్యుడు తన నీతిలో స్త్రీ శక్తి ఎలా ఉంటుందో పేర్కొన్నాడు.
1. మహిళా శక్తి:
మహిళ శ్రావ్యమైన స్వరం వారికి గొప్పశక్తి అని చెబుతారు. స్త్రీల అందం వారికి ఆత్మవిశ్వాసంగా అభివర్ణించారు. కానీ స్త్రీ మధురమైన లేదా తెలివైన పదం మాట్లాడే ముందు…ఆమె శారీరక సౌందర్యం ఫలిందన్నారు. స్త్రీలు మంచి పదాలతో అందరిని తమ అనుచరులుగా మార్చుకుంటారు. మధురంగా మాట్లాడే ప్రతి స్త్రీకి ప్రతిచోటా గౌరవం ఉంటుంది. స్త్రీలకు గున్న అద్భుతమైన గుణాలు ఆ కుటుంబ ప్రతిష్టతను మరింత పెంచుతుంది.
2. బ్రాహ్మణ శక్తి:
బ్రాహ్మణుని జ్ఞానం స్త్రీకి గొప్ప బలం, మూలధనం. దీని ఆధారంగా స్త్రీకి సమాజంలో మంచి హోదా, ప్రతిష్టలు లభిస్తాయి. విజ్ఞానం బ్రాహ్మణులకే కాకుండా ప్రతి వ్యక్తికి శక్తి అని చెప్పారు. ప్రతికూల పరిస్థితులలో, ఇబ్బందులను అధిగమించడానికి సహాయం చేసే ఏకైక శక్తి జ్ఞానం. కాబట్టి ప్రతి వ్యక్తి జ్ఞాన సేవకుడిగా మారాలి అప్పుడే వారి జీవితం మంచి మార్గంలో సాగుతుంది.
3. రాజు శక్తి:
రాజు స్వంత కండరాల శక్తిపై ఆధారపడి ఉంటుంది. ఒక రాజుకు చాలా మంది మంత్రులు, సేవకులు ఉంటారు. కానీ రాజు బలహీనంగా ఉంటే ఎక్కువ కాలం పాలించలేడు. రాజు శక్తిమంతుడైతే తన పరిపాలనను సక్రమంగా నిర్వహిస్తాడు. నాయకుడికి అవగాహన లేకుంటే, మానసికంగా, శారీరకంగా దృఢంగా లేకుంటే నిర్వహణ సరిగా లేక పరిపాలన ముందుకు సాగదు. నాయకుడిగా ఎదగాలంటే… ఈ సామర్థ్యాలన్నీ ఉండాలని చాణక్యుడు చెప్పాడు.