Site icon HashtagU Telugu

Sravana Masam: శ్రావణమాసంలో ప్రతి అమ్మాయి ఆచరించాల్సిన నియమాలు ఏంటో మీకు తెలుసా?

Sravana Masam

Sravana Masam

తెలుగు మాసాలలో పండుగలు, వ్రతాలు, నోములతో నిండిన మాసం ఏదైనా ఉంది అంటే అది శ్రావణమాసం అని చెప్పవచ్చు. ఈ మాసం మొత్తం ఆలయాలు భక్తులతో కిటకిటలాడడంతో పాటు ఇంట్లో కూడా ప్రత్యేకంగా పూజలు చేసుకుంటూ ఉంటారు. మరి ముఖ్యంగా స్త్రీలు ఇంట్లో ఆనందం శ్రేయస్సు సంపద కోసం ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ మాసంలో ఏ ఇల్లు చూసినా దేవాలయం మాదిరిగానే కనిపిస్తుంది. ఎన్నో విశిష్టతలకు నెలవైన ఈ మాసంలో కొన్ని నియమాలు తప్పనిసరిగా ఆచరించాలని పెద్దలు చెబుతూ ఉంటారు.

మరి ముఖ్యంగా స్త్రీలు తప్పకుండా ఈ మాసంలో కొన్ని విషయాలను పాటించాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..కాగా శ్రావణమాసంలో చేపట్టిన ఏ పూజ, యజ్ఞం, హోమం, నోములు ఏదైనా సరే దాని ఫలితం కొన్ని వేల రేట్లు అధికంగా ఇస్తుందని చెబుతారు. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి రోజుకు ప్రాముఖ్యత ఉంటుంది. మంగళవారాలు మంగళ గౌరి దేవిని పూజిస్తారు. సోమవారం శివుడిని ఆరాధిస్తారు. రుద్రాభిషేకం, బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తారు. ఇక ఈ మాసంలో వచ్చే అత్యంత శ్రేష్ఠమైన వ్రతం వరలక్ష్మీ వ్రతం. ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఈ ఏడాది ఆగస్ట్ 16న జరుపుకోనున్నారు. వరలక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ కొత్తగా పెళ్ళైన దంపతుల ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.

అమ్మవారిని పూజించడం వల్ల సకల సుఖాలు, భోగ భాగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. శ్రావణ మాసంలో ప్రతి ఒక్క ఆడపిల్ల ఆచరించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే చేతికి గాజులు వేసుకోవడం, నుదుట కుంకుమ బొట్టు పెట్టుకోవడం, కాళ్ళకు పసుపు రాసుకోవడం, కళ్లకు కాటుక ధరించడం, తలలో పూలు పెట్టుకోవడం చాలా మంచిది. ఈ ఐదు ఆచారాలు పాటించమని చెప్పడం వెనుక లోతైన అర్థం ఉందని అంటారు. శరీరంలోని ఈ భాగాలన్నీ ప్రధాన చక్రాలుగా పిలుస్తారు. చేతికి మట్టి గాజులు ధరించాలి. అలాగే నుదుట స్టికర్స్ వంటివి కాకుండా కుంకుమ బొట్టు ధరించాలి. వేగినస్ అనే నరం గుండెలో ఆరంభమైన శరీరం మొత్తం ఉంటుంది. ఈ నరాన్ని రక్షించడం ఇవన్నీ చేయాలని చెబుతారు. దేహంలోని ఈ శరీర భాగాలు ఉద్రేకభరితం కాకుండా ఆనందంగా ఉంచడం కోసం వీటిని ధరించాలని చెబుతారు. అలాగే ఇవి ప్రతి ఆడపిల్లకు అందాన్ని ఇస్తాయి.