‎Vasthu Tips: అప్పుల బాధలతో సతమతవుతున్నారా.. అయితే ఇంట్లో ఈ మార్పులు చేయాల్సిందే!

‎Vasthu Tips: ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఇంట్లో ఇప్పుడు చెప్పబోయే మార్పులు చేస్తే తప్పకుండా ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు అని చెబుతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Vasthu Tips Money

Vasthu Tips Money

‎Vasthu Tips: ప్రస్తుత రోజుల్లో ప్రతి పదిమందిలో ఎనిమిది మంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. కష్టపడి సంపాదించిన డబ్బు చేతిలో మిగలకపోగా అదనంగా అప్పులు చేయాల్సి వస్తుందని బాధపడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. రోజురోజుకీ ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం కోసం అనేక రకాల పూజలు పరిహారాలు పాటిస్తూ ఉంటారు. అయినా కూడా కొన్నిసార్లు మంచి ఫలితాలు కలగవు.

‎అయితే అటువంటప్పుడు ఇంట్లో ఇప్పుడు చెప్పబోయే మార్పులు చేస్తే తప్పకుండా అంతా మంచే జరుగుతుంది అని చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటిలో లక్ష్మీదేవి కొలువుదీరి, ఆనందం, శ్రేయస్సు నెలకొని, సంపద పెరగాలి అంటే ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. తులసి చెట్టు లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ప్రతి రోజూ తులసి మొక్కను పూజిస్తుంటారు. అయితే ఇంటికి అదృష్టాన్ని తీసుకొచ్చే తులసి మొక్క ఇంటికి ఈశాన్యం దిశలో నాటడం వలన ఆరోగ్యమే కాకుండా, సంపద కూడా పెరుగుతుందట. కలశం స్వచ్ఛతకు గుర్తు అందుకే. దీనిని ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య దిశలో పెట్టడం చాలా మంచిదంట.

‎ దీని వలన జీవితంలోని ప్రతికూల శక్తి తొలిగిపోయి, సానుకూల శక్తి ప్రవేశిస్తుందట. ఇది ఇంటి లోపల ఆనందం,సంపదకు కారణం అవుతుందట. సముద్రం నుంచి తీసిన పవిత్ర వస్తువు అయిన శంఖాన్ని లక్ష్మీదేవి చిహ్నంగా పరిగణిస్తారు. అయితే దీనిని కూడా పూజా సమయంలో ఊదడం సహజం, అయితే దీనిని లక్ష్మీదేవి విగ్రహానికి కుడివైపున పెట్టాలట. అలాగే స్వస్తిక్, శుభం అనే చిహ్నాలు కూడా ఇంటికి అదృష్టాన్ని తీసుకొస్తాయని, కాబట్టి వీటిని ఇంటి ప్రధాన ద్వారం వద్ద గీయడం చాలా మంచిదని చెబుతున్నారు. అలాగే ఇత్తడి, రాగి వంటి లోహాలు చాలా శక్తివంతమైనవి అందువలన వీటిని ఇంటి పూజ గదిలో ఈశాన్యం లేదా ఉత్తర దిశలో పెట్టడం చాలా మంచిదట. ముఖ్యంగా ఇత్తడి గంటను ఉపయోగించి, ఉత్తర దిశలో పెట్టాలట. ఇంట్లో ఈ మార్పులు చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు పండితులు.

  Last Updated: 13 Dec 2025, 08:13 AM IST