2026లో తులా రాశి జాతకంలో చేయాల్సిన పరిహారాలు ఇవే !

జ్యోతిష్యం ప్రకారం, తులా రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. శుక్రుడి ప్రభావంతో వీరు భౌతికంగా చాలా ఆనందంగా ఉంటారు. ఇదిలా ఉండగా కొత్త ఏడాది ప్రారంభంలో తులా రాశి నుంచి రాహువు పంచమ స్థానంలో, శని ఆరో స్థానంలో, కేతువు పదకొండో స్థానంలో, గురుడు తొమ్మిదో స్థానంలో, జూన్ 2న కర్కాటకం నుంచి దశమ స్థానంలో ప్రవేశించనున్నాడు. పంచమ స్థానంలో రాహువు, తొమ్మిదో స్థానంలో గురుడు ఉన్నప్పుడు ఈ రెండు గ్రహాల మధ్య త్రిభుజాకార యోగం […]

Published By: HashtagU Telugu Desk
Tula

Tula

జ్యోతిష్యం ప్రకారం, తులా రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. శుక్రుడి ప్రభావంతో వీరు భౌతికంగా చాలా ఆనందంగా ఉంటారు. ఇదిలా ఉండగా కొత్త ఏడాది ప్రారంభంలో తులా రాశి నుంచి రాహువు పంచమ స్థానంలో, శని ఆరో స్థానంలో, కేతువు పదకొండో స్థానంలో, గురుడు తొమ్మిదో స్థానంలో, జూన్ 2న కర్కాటకం నుంచి దశమ స్థానంలో ప్రవేశించనున్నాడు. పంచమ స్థానంలో రాహువు, తొమ్మిదో స్థానంలో గురుడు ఉన్నప్పుడు ఈ రెండు గ్రహాల మధ్య త్రిభుజాకార యోగం ఏర్పడనుంది. ఈ కారణంగా గురువు అనుగ్రహంతో ప్రతికూల సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. అంతేకాదు సూర్యుని ప్రత్యేక ఆశీస్సులతో శుభ ఫలితాలు రానున్నాయి. మీ జీవితంలో కొత్త వెలుగులు వచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి రాబడి వస్తుంది. వ్యాపారులకు మంచి లాభాలు రానున్నాయి. ఈ సందర్భంగా కెరీర్, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, ఆర్థిక పరంగా 2026 సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆర్థిక పరిస్థితి.

తులా రాశి వారికి కొత్త ఏడాది 2026లో ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. ఈ కాలంలో గురుడు ఉచ్ఛ స్థితిలో తిరోగమన దిశలో ఉన్నప్పుడు మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడులు, ఆస్తికి సంబంధించిన నిర్ణయాలలో మీరు సంయమనం పాటించాలి. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు. జూన్ 2 నుంచి దశమ స్థానంలో సంచారం చేసే సమయంలో ఉద్యోగులు, వ్యాపారులకు అద్భుత ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. అక్టోబర్ 18 తర్వాత పదకొండో స్థానంలో మారినప్పుడు, మీ ఆదాయం మరింత పెరుగుతుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీకు స్నేహితులుల లేదా తోబుట్టువుల నుంచి అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

కెరీర్ పరంగా..

​కొత్త ఏడాది 2026లో తులా రాశి వారికి కెరీర్ పరంగా కీలకం కానుంది. జూన్ 2 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుడు దశమ స్థానంలో సంచారం చేసే సమయంలో మీ పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. శని ఆరో స్థానంలో సంచారం చేసే సమయంలో ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి. నిరుద్యోగులకు పోటీ పరీక్షల్లో మంచి విజయం లభిస్తుంది. సూర్యుని అనుగ్రహంతో శత్రువులపై ఆధిపత్యం చెలాయిస్తారు. జూన్ 2 తర్వాత గురుడు ఉన్నత స్థితికి చేరుకున్న సమయంలో కెరీర్ పరంగా మీకు మంచి పురోగతి లభిస్తుంది.

వ్యాపార పరంగా..

తులా రాశి వారికి కొత్త ఏడాది 2026లో బుధుడు తిరోగమనంలో ఉన్న సమయంలో వ్యాపార రంగంలో అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ కాలంలో మీకు అనేక సవాళ్లు ఎదురవుతాయి. మీరు కష్టపడి పని చేయాలి. విదేశీ కంపెనీలు లేదా బహుళజాతి సంస్థలతో భాగస్వామ్యాలు, వ్యాపార అవకాశాలు ఏర్పడొచ్చు. గజకేసరి యోగం సమయంలో మీకు అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. కొత్త పెట్టుబడి లేదా ఏదైనా ప్రాజెక్టును ప్రారంభించే ముందు మీరు అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలి. మీ కష్టానికి తగిన ఫలితాలొస్తాయి. మీ అంచనాలన్నీ నిజమవుతాయి.

విద్యా జీవితంలో..

తులా రాశి వారికి కొత్త ఏడాది 2026లో విద్యా రంగంలో శుభ ఫలితాలు రానున్నాయి. పంచమ స్థానంలో రాహువు సంచారం చేసే సమయంలో ఈ రాశి విద్యార్థులకు అనేక విజయాలు లభించనున్నాయి. ఈ కాలంలో ఉన్నత విద్య, విదేశీ అధ్యయనాలు, పరిశోధన, ఇతర రంగాల్లో మంచి విజయాలు సాధించే అవకాశం ఉంది. ఈ కాలంలో విద్యార్థులకు, పరిశోధకులకు శుభప్రదంగా ఉంటుంది. కళ, సాహిత్య రంగాల్లో ఉండే వారికి గణనీయమైన ప్రయోజనాలు కలగనున్నాయి. రాహువు స్థానం మార్పుతో మీ విద్యా రంగంలో ఆకస్మిక మార్పులు జరగనున్నాయి. కాబట్టి అధ్యయనాలు పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఏవైనా నిర్ణయాలు ఆలోచనాత్మకంగా తీసుకోవాలి.

ఆరోగ్య పరంగా..

తులా రాశి వారికి కొత్త ఏడాది 2026లో ఆరోగ్య విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. సూర్యుడు, కుజుడి ప్రభావంతో మీకు కడుపు, జీర్ణానికి సంబంధించి కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ 3 నుంచి మే 10వ తేదీ వరకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో రక్తపోటు సమస్యల గురించి ఒత్తిడి పెరగొచ్చు. శని ఆరో స్థానంలో సంచారం చేసే సమయంలో మీరు క్రమశిక్షణ, క్రమబద్ధమైన జీవనశైలిని పాటించడం వల్ల ఆరోగ్య పరంగా మెరుగ్గా ఉంటుంది. గురుడి ప్రభావంతో మీకు ఆరోగ్య పరంగా అనేక మెరుగైన ఫలితాలు రానున్నాయి.

వివాహం, ప్రేమ జీవితంలో..

తులా రాశి వారికి 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో ప్రేమ, వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితాలు రానున్నాయి. పంచమ స్థానంలో రాహువు సంచారం కారణంగా ప్రేమ జీవితంలో ఆకస్మిక మార్పులు రావొచ్చు. కొన్నిసార్లు మీ సాన్నిహిత్యం పెరగొచ్చు. పెట్టుబడులు, భాగస్వామ్యాలు, కుటుంబ విషయాల్లో మీకు చాలా నిగ్రహాన్ని పాటించాలి. అంతేకాదు మూడో స్థానంలో రాహువు-కేతువు ప్రభావంతో మీ వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. మీ వ్యక్తిగత జీవితంలో మెరుగైన ఫలితాలు రానున్నాయి.

ఏ పరిహారాలు పాటించాలంటే..

* తులా రాశి వారు కొత్త ఏడాదిలో ప్రతిరోజూ సూర్య భగవానుడికి నీటిని అర్ఘ్యం సమర్పించాలి.
* మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు దానధర్మాలు చేయాలి.
* ప్రతిరోజూ మీరు శుక్రుడికి సంబంధించిన మంత్రాలను జపించాలి.
* మీరు శివ చాలీసా పారాయణం చేయాలి. శుక్రవారం రోజున కనకధార స్తోత్రం పఠించాలి.

  Last Updated: 30 Dec 2025, 05:34 PM IST