2026లో కుంభరాశి జాతకంలో చేయాల్సిన పరిహారాలు ఇవే !

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఆంగ్ల నూతన సంవత్సరం 2026లో కుంభ రాశి వారికి కెరీర్, వ్యాపారం, ఆరోగ్య పరంగా ఎలాంటి ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్యం ప్రకారం, కుంభ రాశి వారికి శనీశ్వరుడు అధిపతిగా ఉంటాడు. కర్మలకు, న్యాయానికి అధిపతి అయిన శని ప్రభావంతో ఈ రాశి వారు చాలా క్రమశిక్షణతో ఉంటారు. కొత్త ఏడాదిలో ఈ రాశి నుంచి శని రెండో స్థానంలో, రాహువు లగ్న స్థానంలో,చంద్రుడు నాలుగో స్థానంలో, గురుడు పంచమ […]

Published By: HashtagU Telugu Desk
Kumbha

Kumbha

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఆంగ్ల నూతన సంవత్సరం 2026లో కుంభ రాశి వారికి కెరీర్, వ్యాపారం, ఆరోగ్య పరంగా ఎలాంటి ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యోతిష్యం ప్రకారం, కుంభ రాశి వారికి శనీశ్వరుడు అధిపతిగా ఉంటాడు. కర్మలకు, న్యాయానికి అధిపతి అయిన శని ప్రభావంతో ఈ రాశి వారు చాలా క్రమశిక్షణతో ఉంటారు. కొత్త ఏడాదిలో ఈ రాశి నుంచి శని రెండో స్థానంలో, రాహువు లగ్న స్థానంలో,చంద్రుడు నాలుగో స్థానంలో, గురుడు పంచమ స్థానంలో సంచారం చేయనున్నారు. అదే విధంగా కేతువు సప్తమ స్థానంలో, సూర్యుడు, శుక్రుడు, కుజుడు, బుధ గ్రహాలు వరుస స్థానాల్లో తరచుగా మారడం వల్ల మెరుగైన ఫలితాలు రానున్నాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. ఈ సందర్భంగా కుంభ రాశి వారికి కెరీర్, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, ఆర్థిక పరంగా 2026 సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆర్థిక పరిస్థితి..

కుంభ రాశి వారికి కొత్త ఏడాది 2026లో ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ రాశి నుంచి పంచ గ్రహాలు లాభ స్థానంలో సంచారం చేయడం వల్ల మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అయితే గురుడు పంచమ స్థానంలో ఉన్న సమయంలో అంటే ఫిబ్రవరి నెలలో కొన్ని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మే 15వ తేదీ నుంచి జూలై 15 వరకు సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే జూలై 27 నుంచి శని తిరోగమనం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీకు ఇబ్బందులు తప్పవు. మరోవైపు కుజుడు బలహీన స్థానంలో ఉన్నప్పుడు కొంత నష్టం రావొచ్చు. మార్చి నుంచి సెప్టెంబర్ వరకు శని దేవుని ఆశీస్సులతో వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయొచ్చు.

కెరీర్ పరంగా..

కొత్త ఏడాది 2026లో కుంభ రాశి వారికి కెరీర్ పరంగా శుభ ఫలితాలు రానున్నాయి. జనవరి నుంచి ఏప్రిల్ వరకు మీరు కష్టపడి పని చేయాలి. అప్పుడే మీకు మంచి విజయాలు లభిస్తాయి. ఉద్యోగులు తమ పనులను సమర్థవంతంగా, పూర్తి ఉత్సాహంగా చేస్తారు. ఈ కాలంలో ఉద్యోగాన్ని మార్చేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. శని దేవుని అనుగ్రహంతో ఈ కాలంలో ఉద్యోగానికి సంబంధించి కొన్ని ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. మీరు కోరుకున్న చోటుకు ప్రమోషన్ లభిస్తుంది. ఏడాది చివర్లో కెరీర్ పరంగా గణనీయమైన మార్పులు చూస్తారు. అక్టోబర్ మాసంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది.

వ్యాపార పరంగా..

కుంభ రాశి వారికి కొత్త ఏడాది 2026లో వ్యాపార రంగంలో కష్టానికి తగిన ఫలితాలు రానున్నాయి. ఈ సమయంలో మీరు చాలా కష్టపడి పని చేయాలి. మీరు ఏదైనా పెద్ద ప్రణాళికల గురించి ఆలోచిస్తుంటే, ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. శని దేవుడి అనుగ్రహంతో మీ కోరికలన్నీ నెరవేరే అవకాశం ఉంది. జనవరి నుంచి మే వరకు మీరు కొత్త పనులు ప్రారంభించొచ్చు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 మధ్య కొత్తగా ఏదైనా ప్రారంభించకుండా ఉండాలి. సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 12వ తేదీ వరకు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది.

విద్యా జీవితంలో..

కుంభ రాశి వారికి కొత్త ఏడాది 2026లో విద్యా రంగంలో మంచి ఫలితాలు రానున్నాయి. కొత్త ఏడాదిలో గురుడు పంచమ స్థానంలో ఉన్నప్పుడు, మీరు ఏదైనా కోర్సులో చేరడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. విదేశాలలో చదువుకోవాలనుకునే మీ కల కూడా నెరవేరొచ్చు. పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధిస్తారు. మే నెలలో మీకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు గురువులు, సీనియర్ల సలహాలు తీసుకోవాలి.

ఆరోగ్య పరంగా..

కుంభ రాశి వారికి కొత్త ఏడాది 2026లో ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది. గురుడు పంచమ స్థానంలో సంచారం చేసే సమయంలో శుభప్రదంగా ఉంటుంది. మరోవైపు శని సాడే సతి సమయంలో, రాహువు లగ్నదిశలో సంచారం చేయనున్నాడు. ఇది మీ మానసిక ఆందోళన, ఒత్తిడికి దారి తీస్తుంది. కొత్త ఏడాదిలో మీరు చేసే ప్రయాణంలో మీ ఆహారపు అలవాట్లను జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఎలాంటి పెద్ద ఆరోగ్య సమస్యలు తలెత్తవు.

వివాహం, ప్రేమ జీవితంలో..

కుంభ రాశి వారికి 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో ప్రేమ, వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మార్చి తర్వాత మీ వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. గురుడు పంచమ స్థానంలో సంచారం చేసే సమయంలో మీరు ప్రేమ వివాహం జరుపుకునే అవకాశం ఉంది. ఇది ప్రేమ సంబంధాలకు చాలా మంచిది. పిల్లల వైపు నుంచి మీరు కొన్ని శుభవార్తలు వింటారు. కొత్తగా పెళ్లైన వారికి సంతానం కలిగే అవకాశం ఉంది. మే నాటికి గర్భం దాల్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఏ పరిహారాలు పాటించాలంటే..

* కుంభ రాశి వారు కొత్త ఏడాదిలో ప్రతిరోజూ శివుడిని పూజించి, రుద్రాభిషేకం చేయాలి.
* ఏడాది పొడవునా శని, హనుమాన్ చాలీసా పఠించాలి.
* ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
* శనివారం రోజున శని మంత్రాలను జపిస్తూ, శనీశ్వరుడిని దర్శించుకోవాలి.

  Last Updated: 31 Dec 2025, 10:25 AM IST