Site icon HashtagU Telugu

Navratri: దుర్గాష్టమి రోజు పూజా, ఆచరించాల్సిన పద్ధతులు ఇవే…!!

Goddesses Durga

Goddesses Durga

దేశవ్యాప్తంగా దేవినవరాత్రులు వైభవంగా సాగుతున్నాయి. దుర్గామాత ప్రతిమకు భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజులపాటు తొమ్మిది రూపాల్లో కొలువైన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నవరాత్రుల్లో 8వరోజు దుర్గాష్టమి. ఈ ఏడాది దుర్గాష్టమి అక్టోబర్ 2వ తేదీని వచ్చింది. పార్వతిదేవి స్వరూపమే మహాగౌరీ. ఈ మహాగౌరీ రూపంలో కొలువైన అమ్మవారిని దర్శించడం వల్ల సంపద పెరుగుతుంది. తెలివితేటలు కూడా పెరుగుతాయి. అందుకే పిల్లల్లు దుర్గాష్టమి రోజు పార్వతీదేవికి పూజలు చేస్తే ఆరోగ్యం బాగుంటుందని చెబుతుంటారు. అంతేకాదు దుర్గాష్టమిరోజునా ఆయుధ పూజ కూడా నిర్వహిస్తారు. పసుపుకుంకుమలతో అలంకరించి. పూజలు చేస్తారు. ఇవాళ చాలామంది ఉపవాసం కూడా ఉంటారు.

దుర్గాష్టమి పూజ ఎలా చేయాలి..?
దుర్గాష్టమి పూజ ఎలా చేయాలంటే…మహాగౌరీదేవికి పూలనుపెట్టి పూజించాలి. కలశపూజ చేసిన తర్వాత అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిది. శనగలు, కొబ్బరియాను నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు చాలా మంది అన్నదానం కూడా చేస్తుంటారు. ఇలా వస్తే మంచి ఫలితం వస్తుంది. దుర్గామాత రూపంలో దుర్గాష్టమి రోజున కనకదుర్గమ్మవారు దర్శనమిస్తారు. ఆలయాల్లో కూడా దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.

లక్ష్మీ దేవి శ్లోకాలు:
లక్ష్మీదేవి
యా దేవి సర్వ భూథేషు
లక్ష్మీ రూపేణ సంస్థిథా
నమస్థస్యై నమస్థస్యై
నమస్థస్యై నమో నమహ

నమస్తేఽస్తు మహామాయే
శ్రీపీఠే సురపూజితే
శఙ్ఖచక్రగదాహస్తే
మహాలక్ష్మి నమోఽస్తుతే

కరాగ్రే వసతే లక్ష్మీః
కరమధ్యే సరస్వతీ
కరమూలే థు గోవింధా
ప్రభాతే కరదర్శనమ్

సర్వ మంగల మాంగల్యే
శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే గౌరీ
నారాయణి నమోస్తుతే

సముద్ర వసనే దేవీ
పర్వత స్తన మండలే
విష్ణుపత్ని నమస్తుభ్యం
పాదస్పర్శం క్షమస్వమే

అన్న పూర్ణే సధా పూర్ణే
షంకర ప్రాణ వల్లభే
గ్నన వైరాగ్య సిద్ధ్యర్థం
భిక్షాం ధేహి చ పార్వథి
మథా చ పార్వథీ దేవీ
పిథా దేవో మహేష్వరహ
భాందవాహ షివ భక్థాష్చ
స్వధేషో భువనథ్రయం..