హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో దీపావళి కూడా ఒకటి. ఈ పండుగ రోజు ఇంటిని మొత్తం దీపాలతో చక్కగా అలంకరిస్తూ ఉంటారు. అలాగే లక్ష్మిదేవిని ప్రత్యేకంగా పూజీస్తూ ఉంటారు. అయితే ఈ దీపావళి పండుగ రోజు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శ్రీహరికీ, భూదేవికీ కలిగినవాడు వారసుడు నరకుడు. లోకంలో ప్రజలని తీవ్రంగా శారీరకంగానూ మానసికంగానూ హింసిస్తూ ఉండేవాడు. ఆ బాధను తట్టుకోలేక తల్లి అయిన భూదేవి, పరమ సహనమూర్తి అయిన తన భర్తతో మొరపెట్టుకుంది.
వీడిని సంహరించి మిగిలిన ప్రజలని రక్షించు అని కోరింది. తమ తమ పుత్రుల్ని ఎంత దుర్మార్గులైనా సరే వెనుకొసుకొచ్చే ధృతరాష్ట్ర జనాన్ని లోకంలో చూస్తాము. అందుకు తండ్రి శ్రీహరి అంగీకరించాడట. ఈ విశేషాన్ని తెలియచేస్తూ నరక చతుర్దశి రోజున నరకుని బొమ్మని దహింప చేస్తారు. వాతావరణంలో చలి బాగా ప్రవేశించే రోజులైనందున వ్యాధులు ప్రబలే అవకాశముంది. ఆ కారణంగా నరక చతుర్దశి నాటి స్నానవేళలో ఆముదపు తీగని, ఆనప తీగని, తలచుట్టూ తిప్పి విసిరివేస్తే దృష్టి దోషాలు కూడా తొలగి పోతాయని చెబుతారు. దీపావళినాటి అర్ధరాత్ర కాలంలో లక్ష్మీపూజని చేయాలి.
ఇంటి మధ్య భాగంలో ధాన్యపురాశితో చిన్నవేదికని ఏర్పాటు చేయాలి. ఆ ధాన్యంపై అమ్మవారి ప్రతిమను ఉంచాలి. శక్తి మేరకు శ్రీసూక్త విధానంలో పూజ పూర్తి చేయాలి. లక్ష్మీభర్త అయిన శ్రీహరి నీలమేఘ శ్యాముడు కాబట్టి లక్ష్మికి కూడా నలుపు రంగంటే ఇష్టమే. నల్లని తనంలో ఉండే అమవాస్య ఆమెకి పూజాదినం. నల్లని రంగంటే ఆమెకు ఇష్టమున్నా తెల్లని వస్త్రాలు, తెల్లని గంధం, తెల్లని పుష్ప మాలికలను ధరిస్తుంది. కాగా లక్ష్మికి దీపావళినాడు అర్ధరాత్ర పూజ చేస్తే సర్వసంపదలనీ ఇస్తుందట. అయితే దీపావళి రోజు తెల్లవారు జామున వీలైతే పారే నదిలో స్నానం చేయాలి. అలా చేయగలిగిన వారికి అంగీరసుడు మొదలైన మహర్షులు తపస్సు చేసి నదుల్లో నిక్షిప్తం చేసిన తపశ్శక్తి మనకు లభిస్తుందట. ఇది మనం ఎంత భక్తిశ్రద్ధలతో ఆ నీటిలో మునిగాము అన్న దానిపై ఆధారపడి ఉంటుందట.