Site icon HashtagU Telugu

Good Luck: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా.. ఈ సంకేతాలతో మీ అదృష్టం మారినట్టే?

Good Luck

Good Luck

సాధారణంగా మనం చేసే కొన్ను తప్పులు మనకు మన ఆర్థిక పరిస్థితి దెబ్బతీయడానికి కూడా కారణం అవుతూ ఉంటాయి. అయితే నిజ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు అలాగే కొన్ని సంకేతాలు మన ఆర్థికపరిస్థితిని సూచిస్తాయని చెబుతూ ఉంటారు. మరి లక్ష్మీదేవి అనుగ్రహించింది త్వరలో డబ్బులు రాబోతుంది అనడానికి ఎటువంటి సంకేతాలు సూచిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణంగా దేవుడికి పుట్టిన కొబ్బరికాయలు ఇంటికి తీసుకొస్తూ ఉంటాం. అయితే ఆ కొబ్బరి చిప్పల వల్ల కూడా అదృష్టం వచ్చే అవకాశం ఉంటుంది. ఎలా అంటే నిద్ర లేవగానే కొబ్బరి చిప్ప కనిపిస్తే వారికి డబ్బు త్వరలోనే రాబోతోందని అర్థం.

అయితే కొబ్బరి చిప్పలో కొబ్బరి ఉన్న లేకపోనా కూడా ఆ కొబ్బరి చిప్ప ఉదయం లేవగానే మనకు కనిపిస్తే త్వరలోనే డబ్బు రాబోతోంది అన్నదానికి సంకేతంగా చెప్పవచ్చు. క్షీరసాగరం అంటే పాలసముద్రం. శ్రీ లక్ష్మీదేవి శ్రీమన్నారాయనుడు క్షీరసాగరంలో నివసిస్తారు. అంతేకాకుండా చాలామంది దేవుళ్ళకు పాలతో కూడా అభిషేకాలు చేస్తూ ఉంటారు. నిద్ర లేచిన తర్వాత ఆ పాలు పెరుగు డైరీ ఉత్పత్తుల కనిపిస్తే త్వరలోనే లక్ష్మీదేవి కరుణించబోతోంది అన్న దానికి సంగీతం. ఆవులు.. హిందువులు ఆవులను గోమాతగా భావించి పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఆవుల వల్ల కూడా ధన యోగం కలుగుతుంది. ఆవులు గడ్డిమేస్తున్నప్పుడు వాటి ముఖంలో ముఖం పెట్టి చూడటం వల్ల మీకు డబ్బు వస్తుంది.

చెరుకు గడలను మామూలుగా ప్రతి ఒక్కరు ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా చెరకు గడలను దేవుడికి నైవేద్యంగా కూడా సమర్పిస్తూ ఉంటాం. మీరు ఎప్పుడైనా కానీ అలా బయటకు వెళ్ళినప్పుడు చెరుకు గడలు కానీ చెరుకు తోట కనిపించింది అంటే త్వరలోనే కనక వర్షం కురుస్తుందని అర్థం. కోతిని చూడడం వల్ల కూడా ధనవంతులవుతారు. ఎలా అంటే ప్రయాణం చేస్తున్నప్పుడు మీకు కుడి వైపున ఒక కోతి లేదా కుక్క కనిపిస్తే ధనవంతులు అవుతారని నిపుణులు చెబుతున్నారు. కానీ, మీ ఇంటి దగ్గర ఓ గబ్బిలం వచ్చి ఉంటున్నట్లైతే మీరు త్వరలో ధనవంతులు అవ్వబోతున్నారని అర్థం.

Exit mobile version