Ekadashi Dates 2026 : 2026 లో ఏకాదశి వచ్చే తేదీలు ఇవే!

ఏకాదశి తిథి ఉపవాసం, విష్ణు ఆరాధనతో ముడిపడి ఉంటుంది. ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల మనస్సుపై నియంత్రణ, ఆధ్యాత్మిక పురోగతి, పాప విముక్తి లభిస్తాయని నమ్మకం. అలాగే ఏకాదశి తిథిని హిందూ మత ఆచారాల ప్రకారం పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి వంటి తిథులకు మరింత విశిష్టత ఉంటుంది. ఈ క్రమంలో New Year 2026 సంవత్సరంలో నెల వారీగా ఏకాదశి తిథుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. హిందూ సంప్రదాయంలో ఏకాదశి విశేషమైన ప్రాముఖ్యత […]

Published By: HashtagU Telugu Desk
Ekadashi Dates 2026

Ekadashi Dates 2026

ఏకాదశి తిథి ఉపవాసం, విష్ణు ఆరాధనతో ముడిపడి ఉంటుంది. ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల మనస్సుపై నియంత్రణ, ఆధ్యాత్మిక పురోగతి, పాప విముక్తి లభిస్తాయని నమ్మకం. అలాగే ఏకాదశి తిథిని హిందూ మత ఆచారాల ప్రకారం పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి వంటి తిథులకు మరింత విశిష్టత ఉంటుంది. ఈ క్రమంలో New Year 2026 సంవత్సరంలో నెల వారీగా ఏకాదశి తిథుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

హిందూ సంప్రదాయంలో ఏకాదశి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును ఆరాధిస్తారు. ఈరోజున ప్రత్యేకించి తులసి చెట్టును ఆరాధిస్తారు. కుదిరితే 21 ప్రదక్షిణలు చేస్తారు. అయితే.. ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథుల్లో ఒక్కో తిథికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఆయా తిథిని బట్టి ఏకాదశి రోజు తలస్నానం చేసి, ధూప దీప నైవేద్యాలతో శ్రీమహావిష్ణువుని ఆరాధిస్తే ఆ వాసుదేవుడి అనుగ్రహం కలిగి సిరి సంపదలు, శ్రేయస్సు కలుగుతాయని విశ్వాసం. అలాగే ఏకాదశి రోజు ఆచరించే ఉపవాసం కూడా ఎంతో విశిష్టమైనదిగా పండితులు చెబుతారు.

ఏడాదిలో 24 ఏకాదశి తిథులు

ప్రతి ఏడాది 24 ఏకాదశి తిథులు ఉంటాయి. వీటిలో 12 ఏకాదశి తిథులు  శుక్లపక్షంలో, మరో 12 ఏకాదశి తిథులు కృష్ణపక్షంలో వస్తాయి. ఈ ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే వారు వైకుంఠానికి వెళ్తారని బలమైన విశ్వాసం. అలాగే ఏకాదశి రోజు భక్తి శ్రద్ధలతో శ్రీమహావిష్ణువుని ఆరాధిస్తే పాపాలన్నీ తొలగిపోతాయని కూడా నమ్మకం. ఈ క్రమంలో 2026 కొత్త సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశి తిథులకు సంబంధించిన తేదీలను తెలుసుకుందాం..

2026 సంవత్సరంలో ఏకాదశి తిథుల లిస్ట్‌

జనవరి 14 – షట్టిల ఏకాదశి
జనవరి 29 – జయ ఏకాదశి
ఫిబ్రవరి 13 – విజయ ఏకాదశి
ఫిబ్రవరి 27 – అమలకి ఏకాదశి
మార్చి 15 – పాపమోచనీ ఏకాదశి
మార్చి 29 – కామద ఏకాదశి
ఏప్రిల్‌ 13 – వరూధిని ఏకాదశి
ఏప్రిల్‌ 27 – మోహిని ఏకాదశి
మే 13 – అపర ఏకాదశి
మే 27 – పద్మిని ఏకాదశి
జూన్‌ 11 – పరమ ఏకాదశి
జూన్‌ 25 – నిర్జల ఏకాదశి
జూలై 10 – యోగిని ఏకాదశి
జూలై 25 – దేవశయని ఏకాదశి
ఆగస్టు 9 – కామిక ఏకాదశి
ఆగస్టు 23 – పుత్రద ఏకాదశి
సెప్టెంబర్‌ 7 – అజ ఏకాదశి
సెప్టెంబర్‌ 22 – పరివర్తిని ఏకాదశి
అక్టోబర్‌ 6 – ఇందిరా ఏకాదశి
అక్టోబర్‌ 22 – పాపంకుశ ఏకాదశి
నవంబర్‌ 5 – రామ ఏకాదశి
నవంబర్‌ 20 – దేవుత్తని ఏకాదశి
డిసెంబర్‌ 4 – ఉత్పన్న ఏకాదశి
డిసెంబర్‌ 20 – మోక్షద ఏకాదశి

  Last Updated: 02 Dec 2025, 04:19 PM IST