Sai Baba : గురువారం సాయిబాబాకు పాలాభిషేకం చేస్తే…ఆ దోషాలు తొలగిపోతాయట..!!

గురువారం అంటే సాయినాథుడికి చాలా ఇష్టమైన రోజు...ఈ రోజు బాబాను భక్తితో కోరుకుంటే ఎలాంటికోరికలు అయినా నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు.

  • Written By:
  • Publish Date - July 7, 2022 / 05:00 AM IST

గురువారం అంటే సాయినాథుడికి చాలా ఇష్టమైన రోజు…ఈ రోజు బాబాను భక్తితో కోరుకుంటే ఎలాంటికోరికలు అయినా నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు. ధూపదీపాలతో పాలకోవాతో నైవేద్యం సమర్పించి బాబాను పూజిస్తారు. అయితే గురువారం బాబా విషయంలో పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం.

గురువారం…సాయిబాబాకు ఎంతో ప్రీతికరమైనరోజు. ఈ రోజున సాయిబాబాను ప్రత్యేకించి ప్రార్థించడంతోపాటు…పూజ అనంతరం ఇంటికి చిన్నపిల్లలను పిలిచి ప్రసాదాన్ని అందించి…వారితో కొంతసేపు ఆనందంగా గడిపినట్లయితే బాబా కృపకు చేరవచ్చని పెద్దలు చెబుతున్నారు. ఎందుకంటే బాబాకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టమట. వారితో ఎక్కువ సమయం గడిపేవారని పురాణాలు చెబుతున్నాయి.

కల్మషం లేని స్వచ్చమైన నవ్వులు చిందించే పిల్లలు ఈ ప్రపంచానికి స్పూర్తి దాయకమని..అలాంటి చిన్నారులకు బాబా ప్రసాదాన్ని అందించడం ద్వారా మంచి ఫలితం లభిస్తుందని పండితులు అంటున్నారు. ఈ ప్రత్యేకమైన రోజు బాబా పేరిటి అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం ఫలం దక్కుతుంది.

గురువారం నాడు సాయినాథుడి విగ్రహానికి పాలాభిషేకం చేస్తే చాలా మంచిది. అంతేకాదు బాబాకు ఇష్టమైన నైవేద్యం పాలకోవా అందించడం మరింత మంచిది. అదేవిధంగా గురువారం పూజగదిని ప్రత్యేకించి అలంకరించడం, ధూపదీపాలతో బాబాను పూజించడం మంచిది. బాబాకు జీవహింస అస్సలు నచ్చదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని బాబాను స్మరించుకుంటే మనకు అన్ని దోషాలు తొలగిపోతాయి.