January 2026 : నూతన సంవత్సరం 2026కి స్వాగతం పలకడానికి అందరూ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొంత మంది తీర్థయాత్రలు ప్లాన్ చేస్తుంటే.. కొంత మంది బంగారం, వెండి కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తుంటారు.. మరికొంత మందయితే కొత్త వెహికల్స్, కొత్త స్థలం వంటివి కొనడానికి ప్లాన్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది 2026 జనవరి నెలలో కొత్త వెహికల్స్ కొనగోలు చేయడానికి శుభ తేదీలు, శుభ ముహూర్తం వంటివి ఇప్పుడు చూద్దాం..
నూతన సంవత్సరం 2026 మరికొద్ది రోజుల్లో ఆహ్వానించబోతున్నాం. అయితే.. చాలా మంది కొత్త ఏడాదిలో కొత్త వాహనాలు బైక్స్ (Bikes), కార్లు (Cars), ట్రాక్టర్లు (Tractor) లేదా హెవీ వెహికల్స్ (Heavy Vehicles) కొనుగోలు చేయడానికి బాగా ఇంట్రస్ట్ చూపుతారు. చాలా మంది ఎప్పుడు కొనాలి.. ఏ వెహికల్ కొనాలి అని ఈపాటికే లెక్కలు వేసుకుంటూ ఉంటారు. అయితే హిందూ సంప్రదాయంలో ఏ పని ప్రారంభించినా.. ఏదైనా కొత్త వాహనం, కొత్త వస్తువులు కొనుగోలు చేయాలనుకున్నా శుభ ముహూర్తం చూడటం అనేది చాలా కామన్. కొత్త వాహనం కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటే ఆ రోజు తిథి,శుభ ఘడియలు, శుభ సమయం, శుభ దినం అన్నీ చూసి చూసి కొనుగోలు చేస్తారు. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం 2026 జనవరి నెలలో కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి శుభ ముహూర్తాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
జనవరి 1, 2026
నూతన సంవత్సరం 2026 జనవరి నెలలో జనవరి 1వ తేదీ గురువారం రోజు రోహిణి నక్షత్రం, త్రయోదశి తిథి ఉంటుంది. ఆ రోజున ఉదయం 7.14 గంటల నుంచి 10:22 గంటల వరకు శుభ ముహూర్తం ఉంది.
జనవరి 2, 2026
నూతన సంవత్సరం 2026 జనవరి నెలలో జనవరి 2వ తేదీ శుక్రవారం రోజు మృగశిర నక్షత్రం, చతుర్ధశి తిథి ఉంటుంది సాయంత్రం పౌర్ణమి తిథి వస్తుంది. కాబట్టి పౌర్ణమి ఘడియల్లో జనవరి 2వ తేదీ సాయంత్రం 06:53 గంటల నుంచి 08:04 గంటల మధ్యన శుభ ఘడియలు ఉన్నాయి.
జనవరి 4, 2026
నూతన సంవత్సరం 2026 జనవరి నెలలో జనవరి 4వ తేదీ ఆదివారం రోజు పునర్వసు నక్షత్రం, పాడ్యమి తిథి ఉంటుంది. ఆ రోజున ఉదయం 07.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.29 గంటల మధ్యన శుభ ముహూర్తం ఉంటుంది.
జనవరి 5, 2026
నూతన సంవత్సరం 2026 జనవరి నెలలో జనవరి 5వ తేదీ సోమవారం రోజు పుష్యమి నక్షత్రం, విదియ తిథి ఉంటుంది. ఆ రోజున ఉదయం 09:56 గంటల నుంచి మధ్యాహ్నం 01:25 గంటల వరకు శుభ ఘడియలు ఉంటాయి.
జనవరి 11, 2026
నూతన సంవత్సరం 2026 జనవరి నెలలో జనవరి 11వ తేదీ ఆదివారం రోజు చిత్త నక్షత్రం, అష్టమి తిథి ఉంటుంది. ఆ రోజున ఉదయం 07:16 గంటల నుంచి 10:20 గంటల వరకు శుభ ఘడియలు ఉంటాయి.
జనవరి 12, 2026
నూతన సంవత్సరం 2026 జనవరి నెలలో జనవరి 12వ తేదీ సోమవారం రోజు స్వాతి నక్షత్రం, నవమి తిథి ఉంటుంది. మధ్యాహ్నం దశమి తిథి వస్తుంది. ఈ రోజున దశమి ఘడియల్లో మధ్యాహ్నం 12:42 గంటల నుంచి రాత్రి 09:05 గంటల వరకు శుభ ఘడియలు ఉంటాయి.
జనవరి 14, 2026
నూతన సంవత్సరం 2026 జనవరి నెలలో జనవరి 14వ తేదీ బుధవారం రోజు అనురాధ నక్షత్రం, ఏకాదశి తిథి ఉంటుంది. ఆ రోజున ఉదయం 07:16 గంటల నుంచి సాయంత్రం 05:52 గంటల వరకు శుభ ఘడియలు ఉంటాయి.
జనవరి 21, 2026
నూతన సంవత్సరం 2026 జనవరి నెలలో జనవరి 21వ తేదీ బుధవారం రోజు దనిష్ట , శతబిష నక్షత్రం, తదియ తిథి ఉంటుంది. ఆ రోజున ఉదయం 07:14 గంటల నుంచి మరుసటి రోజు అంటే జనవరి 2వ తేదీ ఉదయం 02:47 గంటల వరకు శుభ ఘడియలు ఉంటాయి.
జనవరి 28, 2026
నూతన సంవత్సరం 2026 జనవరి నెలలో జనవరి 28వ తేదీ బుధవారం రోజు కృతిక నక్షత్రం, దశమి తిథి ఉంటుంది. సాయంత్రం వేళ ఏకాదశి తిథి వస్తుంది. కాబట్టి ఈ రోజున ఉదయం 09:26 గంటల నుంచి మరుసటి రోజు అంటే జనవరి 29వ తేదీ ఏకాదశి రోజు ఉదయం 07:11 గంటల వరకు శుభ ఘడియలు ఉంటాయి.
జనవరి 29, 2026
నూతన సంవత్సరం 2026 జనవరి నెలలో జనవరి 29వ తేదీ గురువారం రోజు రోహిణి నక్షత్రం, ఏకాదశి తిథి ఉంటుంది. ఆ రోజున ఉదయం 07:11 గంటల నుంచి మధ్యాహ్నం 01:55 గంటల వరకు శుభ ఘడియలు ఉంటాయి.
