Site icon HashtagU Telugu

‎Tuesday: నెలలో ఒక మంగళవారం రోజు ఇలా చేస్తే చాలు.. అఖండ రాజయోగం పట్టాల్సిందే!

Tuesday

Tuesday

‎Tuesday: హిందూమతంలో వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. అంతేకాకుండా వారంలో ఒక్కో రోజు ఒక్కో విధమైన పరిహారాలు పాటించడం వల్ల కూడా అనేక అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు పండితులు. ముఖ్యంగా మంగళవారం రోజున చేసే పరిహారాలు మరిన్ని మంచి ఫలితాలను అందిస్తాయట. ఇప్పుడు చెప్పబోయే ఈ పూజ పరిహారాలను నెలలో ఏదైనా ఒక మంగళవారం రోజు పాటించడం వల్ల అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

‎మంగళవారం రోజున ఉదయాన్నే అనగా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలి. అంటే 3:50 నిమిషాల నుంచి 5:30 లోపు ఇంటిని శుభ్రం చేయాలి. అలా ఇంటి ముందు బాగాన్ని శుభ్రం చేసిన తర్వాత రంగుల ముగ్గు వేయాలి. తర్వాత ఆ ముగ్గుపై సువాసన వచ్చే పువ్వులను వేయాలి. తర్వాత ఇంటి లోపల అంతా కూడా శుభ్రం చేసుకోవాలి. కొద్దిగా గళ్ళ ఉప్పు వేసి ఆ నీటితో ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ మీ ఇంటి ముందు అనగా గేటు వద్ద ప్రాంతంలో ముళ్ళ మొక్కలు ఏవైనా ఉంటే వెంటనే వాటిని తొలగించడం మంచిదని చెబుతున్నారు. తర్వాత మంగళవారం రోజు సాయంత్రం ఏడు గంటల వరకు ఇంటి తలుపులు మూసి వేయకూడదు.

‎రాత్రి సమయంలో రాళ్ళ ఉప్పు తీసుకుని ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచాలి. తర్వాత మరకటి రోజు ఉదయం ఆ ఎర్రని బట్టను తీసుకొని ఏదైనా ముళ్ల పొదల్లో, ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి. ఈ విధంగా ఇప్పుడు చెప్పినట్టుగా నెలలో ఏదైనా ఒక మంగళవారం రోజు చేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంత తొలగిపోతుందట. అలాగే ఇంట్లో ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయట. ధన సంపాదనలో కూడా ఎలాంటి లోటు ఉండదని చెబుతున్నారు. మీరు పట్టిందల్లా బంగారమే అని చెబుతున్నారు. కాబట్టి మీరు కూడా అలా ఒక మంగళవారం రోజు చేస్తే అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు.

Exit mobile version