Shani Dev : రోజూ మీకు ఇలా జరుగుతుందా?…అయితే మీరు శనిదేవుని ఆశీస్సులు మీరు పొందినట్లే…!!

శనీశ్వరుడు అనగానే ఉలిక్కిపడుతుంటాం. ఆయన పేరు వింటే ఏదో తెలియన భయం, వణుకు, ఆందోళన చెందుతుంటాం.

  • Written By:
  • Publish Date - September 1, 2022 / 06:00 AM IST

శనీశ్వరుడు అనగానే ఉలిక్కిపడుతుంటాం. ఆయన పేరు వింటే ఏదో తెలియన భయం, వణుకు, ఆందోళన చెందుతుంటాం. మన జాతకంలో శనిప్రభాం ఉండకూదని మనస్సులో కోరుకుంటాం. ఏలినాటి శని, అష్టమశని, అర్థాష్టమ శని…ఈ పేర్లు వినగానే జనాల్లో ఒక రకమైన ఆందోళన, భయం మొదలవుతుంది. కానీ శనీశ్వరుడు ప్రసాదించే వాటి గురించి తెలుసుకుంటే మాత్రం…ఆయన్ని తప్పకుండా ఆరాధిస్తుంటాం.

శనీశ్వరుడిని ఆరాధించేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ప్రతి శనివారం ఆలయాల్లో శనిదేవుడిని పూజిస్తుంటారు. కానీ ఇళ్లలో మాత్రం శని దేవుడి ఫొటో కానీ విగ్రహం కానీ ఉండదు. శాస్త్రాల ప్రకారం..శనిదేవుడు ఎవరినైనా చూసిన వారు చెడు స్థితిలో ఉంటారనే శాపం ఉంది. కానీ శని దృష్టిని నివారించడానికి శనీశ్వరుడి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించపోవడానికి ఇదే కారణం.

ఒకవేళ శనిదేవుడు ప్రసన్నుడైతే…ఆ వ్యక్తికి సర్వతోముఖ ప్రయోజనాలు లభిస్తుంటాయని నమ్ముతుంటారు. శనిదేవుని ఆశీస్సులు ఉన్న వ్యక్తి జీవితంలో చాలా మార్పులు వస్తాయి. ముఖ్యంగా శనిదేవుని అనుగ్రహంతో సకల సౌకర్యాలు పొందుతారు. రాజయోగం లభించినట్లే అర్థం. శనిదేవుని ఆశీస్సులు పొందే సంకేతాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి.

శనిఅనుగ్రహం ఉంచి మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటే ఎలాంటి సమస్య ఉండదు. ఇది కూడా శనీశ్వరుని ఆశీర్వాదానికి సంకేతం. మీ కీర్తిప్రతిష్టలు వేగంగా పెరిగినట్లయితే…మీ పట్ల శనీశ్వరుడి దయం ఉందని భావించండి. శనీశ్వరుడు ప్రసన్నుడైతే..వ్యక్తి కీర్తి చాలా దూరంగా వ్యాప్తిస్తుంది. అలాంటి పరిస్థితిలో శనిదేవుడికి కృతజ్ఞతలు చెప్పండి..శనీశ్వరుడిని పూజించండి. శనివారం మీ చెప్పులు కానీ బూట్లు కానీ పోయినట్లయితే…అది చాలా శుభ సంకేతం. శనిదేవుడు మీ పట్లసంతోషంగా ఉన్నారని అర్థం. దీంతో మీ పనులు ఒక్కొక్కటిగా పూర్తి అవుతాయి.