Sleeping Rules: దిండు కింద అలాంటివి పెట్టుకొని నిద్రపోతున్నారా.. అయితే జాగ్రత్త?

మామూలుగా మనం పడుకునేటప్పుడు తలకింద దిండు వేసుకొని పడుకోవడం అలవాటు. కొందరు తల దిండు లేకుండా అలాగే పడుకుంటే మరికొందరికి తల దిండు లే

  • Written By:
  • Publish Date - December 24, 2023 / 07:30 PM IST

మామూలుగా మనం పడుకునేటప్పుడు తలకింద దిండు వేసుకొని పడుకోవడం అలవాటు. కొందరు తల దిండు లేకుండా అలాగే పడుకుంటే మరికొందరికి తల దిండు లేకపోతే కనీసం నిద్ర కూడా రాదు. అలాగే నిద్రపోయే సమయంలో తల దిండు కింద కొన్ని రకాల వస్తువులు అస్సలు పెట్టుకోకూడదు. మనం కొన్ని వస్తువులను తలకింద పెట్టుకుని నిద్రిస్తున్నప్పుడు, అది మన జీవితంలో ప్రతికూల ప్రభావాలను చూపడం ప్రారంభిస్తుంది. అందుకే కొన్ని వస్తువులను తలకింద పెట్టుకుని పడుకోకూడదు. మరి దిండు కింద ఎలాంటి వస్తువులు పెట్టుకొని పడుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పర్సు.. మీ దిండు కింద పర్సులు, హ్యాండ్‌ బ్యాగ్‌లు వంటివి ఉంచకూడదు. ఎందుకంటే ఇది మీ అనవసర ఖర్చులను పెంచుతుంది. మీ దగ్గర డబ్బు నిల‌వ‌దు.

తాడు లేదా గొలుసు.. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం, తాడు లేదా గొలుసు మనిషి పనిలో తరచుగా అంతరాయాలను కలిగిస్తుంది. అతని పనిని పాడు చేస్తుంది. అందుకే ఇలాంటివి పడుకునేటప్పుడు తల దగ్గర పెట్టుకోకూడదు. ఇలాంటి పెట్టుకుని పడుకోవడం వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది.

క‌ల్వం.. మంచం లేదా మంచం కింద లేదా తల కింద క‌ల్వాన్ని ఉంచడం వల్ల సంబంధాలలో ఉద్రిక్తత ఏర్పడుతుంది. సానుకూల శక్తులను పొందడంలో సహాయపడటానికి బదులుగా ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుంది. ఆ వ్యక్తి అనవసరమైన వివాదాలలో చిక్కుకుంటాడు.

పుస్తకం లేదా పత్రికలు.. చాలామందికి రాత్రి పడుకునే సమయంలో పుస్తకాలు చదవడం అలవాటు. అలా పడుకునేటప్పుడు ఆ వార్తాపత్రికలను మ్యాగజైన్‌లను కింద పెట్టుకొని పడుకుంటూ ఉంటారు. అలా పడుకోవడం వల్ల ఒక వ్యక్తి జీవితాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. జీవితంలో ప్రతికూలతతో పాటు అశుభకరమైన సంఘటనల సంఖ్యను పెంచుతుంది.

బంగారు,వెండి ఆభరణాలు.. ముఖ్యంగా పడుకునేటప్పుడు దిండు కింద బంగారు లేదా వెండి ఆభరణాలను ఉంచడం వల్ల ఆ వ్యక్తి అదృష్టాన్ని బలహీనపరుస్తుంది. బంగారు, వెండి ఆభరణాలే కాకుండా ఇనుప వస్తువులు కూడా ఉంచకూడదు. మీకు దిండు కింద బంగారు ఆభరణాలు పెట్టుకుని నిద్రించే అలవాటు ఉంటే ఈరోజే అలాంటి అలవాటును మానుకోవడం మంచిది. అలాగే మంచం లేదా మంచం దగ్గర లేదా తల దగ్గర బూట్లు, చెప్పులతో పడుకోవడం వల్ల జీవితంలో ప్రతికూలత వ్యాపిస్తుంది. మీ తల లేదా మంచం దగ్గర బూట్లు, చెప్పులతో ఎప్పుడూ నిద్రపోకూడదు. నిద్రపోయేటప్పుడు దిండు కింద నీరు నింపిన ప్లాస్టిక్ లేదా గాజు సీసాని ఉంచడం వల్ల మానసిక అనారోగ్యం లేదా ఒత్తిడికి కార‌ణ‌మ‌వుతుంది. అయితే మీరు రాగి పాత్రలో నీటిని ఉంచవచ్చు. దానిని మీ దిండు లేదా మంచం క్రింద ఉంచుకోవచ్చు.