హిందువులకు అతి ముఖ్యమైన మాసాలలో శ్రావణమాసం కూడా ఒకటి. ఈ శ్రావణమాసంలో ఎన్నో రకాల పండుగలను చేసుకుంటూ ఉంటారు హిందువులు.. ముఖ్యంగా వరలక్ష్మీ వ్రతం నాగుల పంచమి,జన్మాష్టమి లాంటి పండుగలను జరుపుకుంటూ ఉంటారు. ఇకపోతే రేపటి నుంచి శ్రావణమాసం ప్రారంభం కానుంది. ఇక ఈ శ్రావణమాసంలో చాలామంది పరమేశ్వరుని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. పంచామృతాలతో శివుడికి అభిషేకాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే పరమేశ్వరుడికి చాలామంది తెలిసి తెలియక ఈ శ్రావణమాసంలో కొన్ని రకాల వస్తువులు సమర్పిస్తూ ఉంటారు.
కానీ అలా అస్సలు చేయకూడదని చెబుతున్నారు పండితులు. మరి శ్రావణ మాసంలో పరమేశ్వరుడికి ఎలాంటి వస్తువులు సమర్పించకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శివుడిని భోళాశంకరుడి అని పిలుస్తుంటారు. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. అలాంటి ఆ శివయ్యకు కేవలం చెంబెడు నీళ్లు, బిల్వ దళాలు సమర్పిస్తే చాలు ఆయన మనం కోరుకున్న కోరికలన్ని నెరవేరుస్తాడని చెబుతుంటారు. అయితే శివుడిని పూజించేటప్పుడు శివుడిని భూమి మీద పెట్టొద్దంటారు. అలాగే తులసీ ఆకుల్ని మాత్రం అస్సలు సమర్పించకూడదట. తులసి జలంధరుడు అనే రాక్షసుడి భార్య. అందుకే తులసీని శివుడి పూజలో ఉపయోగించకూడదని చెప్తుంటారు.
అదే విధంగా పసుపు, కుంకుమలను కూడా శివుడి పూజలో ఉపయోగించకూడదని చెప్తుంటారు. పసుపు, కుంకుమలు జీవితంలో ఏ శుభకార్యం కూడా పసుపు, కుంకుమలు లేకుండా జరుపుకోము. కానీ శివుడు స్మశానంలో ఎక్కువగా సంచరిస్తాడు. అందుకే ఆయనకు చందనం లేదా భస్మంను సమర్పించాలని చెప్తుంటారు. చెడిపోయిన బిల్వ పత్రాలు, ముదిరిపోయిన బిల్వ పత్రాలు శివలింగానికి పొరపాటున కూడా సమర్పింకూడదట. కేవలం పూర్ణంగా, పచ్చగా ఉన్న మూడు ఆకులు ఉన్న బిల్వ పత్రాలను మాత్రమే శివ పూజలో ఉపయోగించాలి పరమేశ్వరుడికి సమర్పించాలని చెబుతున్నారు. అలాగే శివుడికి చాలా మంది పాలు, పెరుగు, తేనె,నెయ్యి, చక్కెరతో అభిషేకం చేస్తుంటారు. ఇలా అభిషేకం చేసేటప్పుడు కంచు పాత్రలను అస్సలు ఉపయోగించకూడదని చెబుతున్నారు. అదే విధంగా అతి ముఖ్యంగా శివ పూజలో అస్సలు శంఖాన్ని ఉపయోగించకూడదట. పూర్వం శివుడు శంఖ చవుడు అనే రాక్షసుడిని హతమార్చాడట. అందుకే శివుడి పూజలో శంఖాన్ని వాడొద్దని జ్యోతిష్య పండితులు చెప్తుంటారు.