Astro Tips : తమలపాకుతో ఈ 6 నివారణలు మీ అదృష్టానికి తాళం వేస్తాయి..!!

  • Written By:
  • Updated On - November 13, 2022 / 06:28 AM IST

భారతీయ సంస్కృతిలో తమలపాకుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఐశ్వర్యానికి చిహ్నంగా భావించే తమలపాకును అనేక శుభ సందర్భాలలో వాడుతుంటారు. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దేవతలకు సమర్పించే తమలపాకులను కొన్నిసార్లు దేవుడిగా పూజిస్తారు. జ్యోతిషశాస్త్రంలో, తమలపాకులు అనేక రకాల కోరికలను నెరవేర్చడానికి, బాధలను తొలగించడానికి ఉపయోగిస్తారని పేర్కొంది. మత గ్రంధాల ప్రకారం, తమలపాకు హనుమాన్ కు చాలా ఇష్టం. జీవితంలో అద్భుతమైన మార్పులను తీసుకొచ్చే తమలపాకుకు సంబంధించిన కొన్ని ఖచ్చితమైన నివారణల గురించి తెలుసుకుందాం.

1. మీరు కష్టపడి పనిచేసినా…చేతిలో చిల్లిగవ్వ మిగలేకపోతే మానసికంగా కుంగిపోతాం;. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందలేకపోతే…ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి శుక్రవారం నాడు తమలపాకుపై గులాబి రేకులను సమర్పించండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

2. ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే..కోరిన కోరికలు నెరవేరాలంటే…మీరు ప్రసాదంతోపాటు తమలపాకులను హనుమంతుడికి నైవేద్యంగా సమర్పించాలి.

3. మీరు వ్యాపారం నష్టాలు ఎదుర్కొంటుంటే…ఆశించిన లాభాలను పొందానికి శనివారం నాడు మీ ఆఫీసులో ఐదు తమలపాకులు, ఐదు రావి ఆకులను దండగా చేసి ముఖద్వారానికి కట్టండి. తూర్పు దిశలో వేలాడదీయాలి. ఈ పరిహారం చేయడం వల్ల డబ్బు వస్తుందని.. వ్యాపారంలో వేగంగా పురోగతి ఉంటుంది.

4. ఇంట్లోని పూజా స్థలంలో నిత్యం తమలపాకుని దేవుడికి నైవేద్యంగా పెడితే ఆ ఇంటిలోని ప్రతికూలత తొలగిపోయి సానుకూలత పెరుగుతుంది. ఆదివారం తమలపాకును తీసుకుని ఇంటి నుండి బయలుదేరండి. ఈ పరిహారంతో మీ పనులన్నీ పూర్తవుతాయి.

5. సోమవారం నాడు శివునికి సోపు, తమలపాకులు, కాటేచు కలిపి గుల్కండ్‌తో చేసిన పాన్‌ను సమర్పించడం ద్వారా ప్రతి కోరిక నెరవేరుతుంది.

6. మీరు కోరుకున్న ఉద్యోగం రాకపోతే లేదా వ్యాపారంలో నిరంతర ఆటంకాలు ఉంటే, ఆదివారం ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు, మీ జేబులో తమలపాకు ఉంచండి. కావాలంటే పర్సులో తమలపాకు పెట్టుకుని వెళ్లొచ్చు. ఇలా చేయడం వల్ల మీ ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి.