5 Zodiac Signs Anger: మే 23 నుంచి ఈ ఐదు రాశుల వారికి కోపం పెరుగుతుంది…చాలా నష్టపోయే చాన్స్..!!

జ్యోతిష్యం శాస్త్ర లెక్కల ప్రకారం, రాహువు ఏప్రిల్ 12న వృషభరాశి నుండి మేషరాశికి మారాడు.

  • Written By:
  • Publish Date - May 23, 2022 / 07:45 AM IST

జ్యోతిష్యం శాస్త్ర లెక్కల ప్రకారం, రాహువు ఏప్రిల్ 12న వృషభరాశి నుండి మేషరాశికి మారాడు. ఇప్పుడు మే 23న శుక్రుడు కూడా మీనరాశి నుంచి మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మేషరాశిలో శుక్రుడు, రాహువు కలయిక వల్ల క్రోధ యోగం కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఈ యోగం వల్ల కొన్ని రాశుల వారికి తగాదాలు పెరుగుతాయి. వ్యాపారం, ఉద్యోగం, విద్య, వివాహ బంధాల్లో ఉద్రిక్తత వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా ఈ 5 రాశుల వారిలో కోపం ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.

మేషం –
రాహు-శుక్రుల కలయిక వల్ల ఏర్పడిన క్రోధ యోగం మేష రాశివారికి కష్టాలను పెంచుతుంది. మీలో కోపం పెరగవచ్చు. సన్నిహితులతో వివాదాల కారణంగా సంబంధాలు చెడిపోతాయి. కనుక అనవసరమైన వివాదాలను కొని తెచ్చుకోవద్దు. అలాగే వాదోపవాదాలు చిలికి చిలికి గాలివానగా మారుతాయి. అయితే ఈ రాశి వారు 11 మంగళవారాలు హనుమంతుడి పేరిట ఉపవాసం చేయాలి. అలాగే ప్రతి రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే శుభం కలుగుతుంది.

వృషభం –
రాహు-శుక్రుల ఈ అశుభ యోగం మీ రాశిచక్రంలోని రెండవ ఇంట్లో ఉంటుంది. ఇది సంబంధాలను మాత్రమే ప్రభావితం చేయదు, కానీ మీ ఇబ్బందులు ఆర్థికంగా కూడా పెరుగుతాయి. డబ్బు లేకపోవడం వల్ల రెండు, నాలుగు జరగాల్సి రావచ్చు. మీకు ఇష్టం లేకపోయినా మీ ఖర్చులు పెరుగుతాయి. మీ ఇమేజ్ దెబ్బతినవచ్చు. ఈ ప్రభావం నుంచి బయటపడాలంటే ప్రతి రోజు ఆవుకు రొట్టెలు, లేదా అన్నం లేదా అరటిపళ్లు తినిపించాలి, నరసింహ స్వామిని ఆరాధించడం, తులసి కోటకు పూజ చేయడం లాంటివి చేయాలి

సింహం-
మీ రాశికి ఐదవ ఇంట్లో క్రోధ యోగం ఏర్పడుతుంది. ఇది మీ వైవాహిక జీవితంపై చెడు ప్రభావం చూపుతుంది. మీ భాగస్వామితో వివాదాలు పెరగవచ్చు. మాటకు అదుపు లేకపోతే చాలా నష్టపోతారు. ఈ సమయంలో భాగస్వామి ఇష్టానికి వ్యతిరేకంగా ఏ పని చేయకపోవడమే మంచిది. అయితే రాహు, శుక్రుల ప్రభావం నుంచి బయటపడేందుకు విష్ణు సహస్రపారాయణం చేయడం ఉత్తమం.

తులారాశి-
మీ రాశికి సప్తమంలో క్రోధ యోగం ఏర్పడుతుంది. మీ వైవాహిక జీవితం ప్రభావితం కావచ్చు. వైవాహిక జీవితంలో సమస్యలు పెరుగుతాయి. కొంతమంది తమ రిలేషన్ షిప్ నుండి కొంత విరామం తీసుకుని కొంత కాలం పాటు తమ భాగస్వామికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటారనే భయం కూడా ఉంది. ఈ రాశి వారు ఇంటి ముందు తులసి మొక్కను నాటి పూజించాలి, అలాగే పగడం ధరిస్తే మేలు జరుగుతుంది.

కుంభం-
రాహువు-శుక్రులు మీ రాశిలో పదకొండవ స్థానంలో క్రోధ యోగాన్ని సృష్టిస్తారు. ఈ సమయంలో మీ కోరికలు చాలా పెరుగుతాయి. మీ ఏకాగ్రత దెబ్బతింటుంది. మీకు ఏ పని చేయాలనే భావన ఉండదు. మీరు వివాహం చేసుకున్నట్లయితే, మీరు జీవితంలో ఎలాంటి పెద్ద కష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. స్నేహితులు మరియు బంధువులతో వాగ్వాదాలకు దూరంగా ఉండండి. ఈ రాశుల వారు నానబెట్టిన మినుములను లేదా ఇడ్లీలను ఆవుకు తినిపించాలి. అలాగే గోమేధికం ధరిస్తే మంచిది.