Site icon HashtagU Telugu

Krishnashtami: కృష్ణాష్టమి రోజు కన్నయ్యకు ఈ నైవేద్యాలు సమర్పిస్తే చాలు ఆయన అనుగ్రహం కలగడం ఖాయం!

Krishna Janmashtami

Krishna Janmashtami

ఈ ఏడాది అనగా 2024 ఆగస్టు 26 సోమవారం రోజున కృష్ణాష్టమి పండుగను జరుపుకోనున్నారు. శ్రీకృష్ణుడు జన్మించిన రోజునే శ్రీకృష్ణ జన్మాష్టమి గా జరుపుకుంటారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈరోజున కృష్ణుడిని భక్తిశ్రద్ధలతో పూజించడంతోపాటు పిల్లలకు కృష్ణుడి వేషాలు వేసి సాక్షాత్తు ఆ చిన్ని కృష్ణుడే ఇంట్లోకి వచ్చినట్టుగా భావిస్తూ ఉంటారు. చాలామంది పూజలు చేయడంతో పాటు ఈ రోజున ఉపవాసం కూడా ఉంటారు. ఇలా ఉపవాసం ఉండటం వల్ల విశేష ఫలితాలు దక్కుతాయని భావిస్తూ ఉంటారు. అయితే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కన్నయ్యకు భక్తి శ్రద్ధలతో పూజలు చేయడంతో పాటు కొన్ని రకాల నైవేద్యాలు సమర్పిస్తే ఆయన అనుగ్రహం కలగడంతో పాటు మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.

మరి కృష్ణాష్టమి రోజున ఎలాంటి నైవేద్యాలను సమర్పించాలి అన్న విషయానికి వస్తే.. శ్రీ కృష్ణుడికి ఇష్టమైన ఆహార పదార్థాలలో లడ్డు కూడా ఒకటి. లడ్డును నైవేద్యంగా సమర్పించడం వల్ల ఆయన అనుగ్రహం తప్పక కలుగుతుంది. అలాగే కొత్తిమీర పంజరి కృష్ణాష్టమి రోజు తప్పనిసరిగా చేస్తారు. కొత్తిమీరను సంపదకు చిహ్నంగా భావిస్తారు. శ్రీ కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనది కొత్తిమీర. దీనితో తయారు చేసే ఆహార పదార్థాలు నైవేద్యంగా పెట్టవచ్చు కొత్తిమీర పంజిరి సమర్పించడం వల్ల డబ్బుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. అదేవిధంగా జన్మాష్టమి రోజు శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన శ్రీ ఖండ్ సమర్పించడం చాలా మంచి జరుగుతుందట. పెరుగుతో ఈ పదార్థాన్ని తయారుచేస్తారు.

గుజరాత్ లోని ద్వారకా సహా పలు రాష్ట్రాలలో జన్మాష్టమి రోజు కృష్ణుడికి శ్రీఖండ్ నైవేద్యంగా సమర్పిస్తారు. జన్మాష్టమి రోజు శ్రీకృష్ణుడిని ప్రసన్నం చేసుకోవాలని అనుకుంటే మఖన్ మిశ్రీ సమర్పించాలి. పూజలో లడ్డూ గోపాల్ ఈ నైవేద్యం సమర్పించడం వల్ల భక్తులు జీవితం ఆనందంతో నిండిపోతుందట. స్వచ్ఛమైన వెన్న, చక్కెరతో దీన్ని తయారు చేస్తారు. ఇది సమర్పించడం వల్ల కృష్ణుడి ఆశీస్సులు లభిస్తాయట. కృష్ణుడి అనుగ్రహంతో మనసులోని ప్రతి కోరిక నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు. శ్రీ కృష్ణుడికి ఇష్టమైన నైవేద్యాలలో మాల్పువా కూడా ఒకటి. ఈ నైవేద్యాన్ని సమర్పించడం వల్ల కూడా కోరిన కోరికల నెరవేరుతాయట. జన్మాష్టమి రోజు కృష్ణుడికి మోహన్ భోగ్ సమర్పించడం పవిత్రంగా భావిస్తారు. గోధుమపిండి స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో వేయించి పంచదార పొడి కలిపి ఈ నైవేద్యాన్ని తయారు చేస్తారు. జన్మాష్టమి రోజు దీన్ని సమర్పించడం వల్ల కృష్ణుడు సంతోషిస్తాడని నమ్ముతారు. మీరు పైన చెప్పిన నైవేద్యాలను సమర్పించే సమయంలో తప్పకుండా ఒక మంత్రం పాటించాలని చెబుతున్నారు.

త్వియః వాస్తు గోవింద తుబ్యామేవ సమర్పే
గృహ సంముఖో భూత్వ ప్రసిద్ధ పరమేశ్వర..