వెండి చంద్రుడు, శుక్ర గ్రహాలకు సంబంధించినది అన్న విషయం మనందరికీ తెలిసిందే. వెండిని ధరించడం వల్ల మనసును ప్రశాంతంగా మార్చుకోవచ్చట. అలాగే సంపద, శ్రేయస్సు కలుగుతాయట. విజయం, మనశ్శాంతి, ఆనందం కలుగుతాయని, వెండితో చేసిన వస్తువులను దానం చేయడం లేదంటే బహుమతిగా ఇవ్వడం వలన అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు. మరి ఎలాంటి వస్తువులు దానం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఎవరికైనా వెండి నాణెం బహుమతిగా ఇచ్చినట్లయితే, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట. అలాగే సిరిసంపదలకు ఎలాంటి లోటు ఉండదట. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చెబుతున్నారు. శ్రేయస్సు కలుగుతుందట. ఎవరైనా వెండి నాణేన్ని బహుమతిగా ఇచ్చినట్లయితే, దానిని పూజించడం మంచిదని పండితులు
చెబుతున్నారు. అలాగే వెండి వినాయకుడిని బహుమతిగా ఇస్తే కూడా మంచి జరుగుతుందట. దీనిని బహుమతిగా ఇస్తే జీవితంలో సమస్యలు తొలగిపోతాయట.
వినాయకుడు విఘ్నాలను తొలగించి, జీవితంలో సంతోషాన్ని అందిస్తాడట. అలాగే విజయాలను కూడా అందుకోవచ్చని చెబుతున్నారు. అదేవిధంగా వెండి పెన్నును ఎవరికైనా బహుమతిగా ఇచ్చినట్లయితే, జ్ఞానం పెరుగుతుందట. ఏకాగ్రతని కూడా పెంపొందించుకోవచ్చని, పని ప్రదేశంలో సక్సెస్ ని అందుకోవచ్చు అని చెబుతున్నారు. అదేవిధంగా వెండి ఆవు, దూడను ఎవరికైనా బహుమతిగా ఇవ్వడం వలన జీవితంలో సంతోషం కలుగుతుందట. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయని చెబుతున్నారు. వెండి కుందులను బహుమతిగా ఇవ్వడం వలన జీవితంలో సానుకూల శక్తి, సంతోషం ఉంటాయట. ధనం కూడా కలుగుతుందని చెబుతున్నారు.