Site icon HashtagU Telugu

Astrology: శ్రావణమాసంలో ఈ 5 రాశులవారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది…వారు పట్టిందల్లా బంగారమే..!!

Lakshmi Devi

Lakshmi Devi

శ్రావణమాసంలో శివుని అనుగ్రహం మాత్రమే కాదు..లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉండాలి. ఈ శ్రావణమాసంలో శివునితోపాటు లక్ష్మీదేవిని పూజించినట్లయితే…అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఈ శ్రావణమాసంలో ఈ ఐదు రాశులవారికి బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ ఐదురాశుల వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. అయితే ఈ ఐదు రాశుల వారికి ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందో తెలుసుకుందాం.

ఈ రాశుల వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.
1. ధనస్సు రాశి:
ఈ రాశివారికి ఈ నెల బాగా కలిసివస్తుంది. ధనుస్సు రాశి వారు కొన్ని కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. అంటే ప్రమోషన్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆస్తి కొనుగోలు, వ్యాపారం ప్రారంభించడానికి ఇది మంచి సమయం.
2. సింహరాశి:
ఈ రాశివారికి గౌరవం పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభాలు వస్తాయి. మనస్సు ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కష్టానికి పూర్తి ప్రతిఫలం లభిస్తుంది.
3. మీనరాశి:
ఈ రాశివారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. దానధర్మాలు చేసేందుకు ఈ మాసం చాలా మంచిది. మీరు వాహనం కొనుగోలు చేయాలనుకుంటే ఈ సమయంలో కొనుగోలుచేయండి.
4. మిధున రాశి:
ఈ రాశివారికి లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. డబ్బు చేతికందుతుంది. నిస్సహాయుడైన వ్యక్తికి సాయం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కోర్టు కేసులు ఈ నెలలో పరిష్కారం అవుతాయి.
5. తులారాశి:
ఈ రాశివారికి సంఘంలో గౌరవం పెరుగుతుంది. లక్ష్మీదేవి ఆశీస్సులతోపాటు సరస్వతి దేవి ఆశీస్సులు కూడా లభిస్తాయి. రాజకీయాల్లో ప్రయత్నించాలనుకుంటే ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.